ట్రంప్ గోడ కాంట్రాక్ట్ కు భారీ పోటీనట

Update: 2017-03-03 05:39 GMT
అభిప్రాయాలు వేరు వ్యాపారాలు వేరు. విమర్శల దారిన విమర్శలు వెల్లువెత్తుతున్నా.. అమెరికా అధ్యక్షుడి గోడ నిర్ణయంపై పారిశ్రామికవర్గాలు మాత్రం అమితమైన ఆసక్తిని ప్రదర్శించటం ఇప్పుడుఆసక్తికరంగా మారింది. తాను కానీ అమెరికా అధ్యక్ష పదవిని చేపడితే.. అమెరికా.. మెక్సికో మధ్యన గోడ కడతానంటూ ట్రంప్ వివాదాస్పద హామీని ఇవ్వటం తెలిసిందే.

ఇరు దేశాల మధ్య ట్రంప్ నిర్మించతలపెట్టిన గోడపై పెద్ద ఎత్తున విమర్శలు ఎదురవుతున్నా.. గోడ హామీని నెరవేర్చే విషయంలో వెనక్కి తగ్గేది లేదని ట్రంప్ స్పష్టం చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారంలోనే కాదు.. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కూడా ట్రంప్ నోట గోడ మాట పదపదే వచ్చింది. మెక్సికో నుంచి వచ్చే అక్రమ వలసలకు చెక్ పెట్టటంతో పాటు.. డ్రగ్స్ అక్రమ రవాణాకు సరిహద్దు గోడసాయంగా ఉంటుందని ట్రంప్ భావిస్తున్నారు.

అయితే..ఆయన నిర్ణయంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే.. ట్రంప్ కట్టిస్తున్నానంటున్న సరిహద్దు గోడను కట్టేందుకు పెద్ద ఎత్తున కంపెనీలు ముందుకు వస్తుండటం గమనార్హం. గోడ నిర్మాణానికి ఆసక్తిని ప్రదర్శిస్తున్న కంపెనీల్లో క్యాడల్.. డిఫెన్స్ కాంట్రాక్టర్రేథియాన్ లాంటి పేరు మోసిన కంపెనీలు ముందుకువస్తున్నాయి. గోడ కట్టే కాంట్రాక్ట్ కోసం దాదాపు పాతికకంపెనీలు పోటీపడుతుంటే.. వాటిల్లో ఇరవై కంపెనీలు లాటిన్ అమెరికాకు చెందిన కంపెనీలు ఉండటం గమనార్హం.
Read more!

దాదాపు 21 బిలియన్ డాలర్ల ఖర్చు అవుతుందన్నఅంచనాలున్న ఈ గోడను అమెరికా .. మెక్సికో మధ్యనున్న 2వేల కిలోమీటర్ల మేర కడతారా? లేక.. కొంత మేర కడతారా? అన్న దానిపై స్పష్టత రావటం లేదు. ఇప్పటికే వినిపిస్తున 21 బిలియన్ల ఖర్చు.. గోడ నిర్మాణం పూర్తి అయ్యే సమయానికి మరింత పెరిగే అవకాశం ఉంటుందన్న మాట వినిపిస్తుంది. తన పదవీకాలంలో ఇరు దేశాల మధ్య గోడ కట్టి తీరుతానని చెబుతున్న ట్రంప్ మాటలు  ఎంతమేర వాస్తవంగా మారతాయన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News