'కలర్‌ ప్రిడెక్షన్‌ '...ఈడీ విచారణ షురూ !

Update: 2020-09-23 08:50 GMT
ఈ– కామర్స్‌ సంస్థల ముసుగులో భారీ బెట్టింగ్‌ గేమింగ్‌కు పాల్పడిన కలర్‌ ప్రిడెక్షన్ కేసులో నిందితులుగా ఉన్న చైనా జాతీయుడు యాన్‌ హూ సహా ముగ్గురిని ఈడీ అధికారులు మంగళవారం కస్టడీలోకి తీసుకున్నారు.  మల్టీ లెవల్‌ మార్కెటింగ్ ‌తోనూ ముడిపడి ఉన్న ఈ వ్యవహారాన్ని హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు గత నెల 13న బయటపెట్టారు. దీనిపై ఈడీకి ఓ సమగ్రమైన లేఖ రాశారు. ఈ దందాలో పెద్ద ఎత్తున మనీ లాండరింగ్‌ జరిగి ఉంటుందని అనుమానిస్తూ పూర్తి వివరాలను సమర్పించారు.

ఆ ఆధారాలతో ఈడీ ఈ నెల 15న యాన్‌ హూతో పాటు ఢిల్లీ వాసులు ధీరజ్‌ సర్కార్, అంకిత్‌ కపూర్ ‌లపై మనీ లాండరింగ్‌ కేసు నమోదు చేసింది. చైనాకు చెందిన బీజింగ్‌ టీ పవర్‌ సంస్థ సౌత్‌ ఈస్ట్‌ ఏషియా ఆపరేషన్స్‌ హెడ్‌ గా తమ జాతీయుడు యా హౌను నియమించింది. గుర్గావ్‌ కేంద్రంగా వ్యవహారాలు నడుపుతున్న ఇతగాడు ఢిల్లీ వాసులు ధీరజ్‌ సర్కార్, అంకిత్‌ కపూర్, నీరజ్‌ తులేలను డైరెక్టర్లుగా ఏర్పాటు చేసుకున్నాడు. వీరంతా కలిసి ఈ– కామర్స్‌ సంస్థల ముసుగులో గ్రోవింగ్‌ ఇన్ఫోటెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, సిలీ కన్సల్టింగ్‌ సర్వీసెస్, పాన్‌ యన్‌ టెక్నాలజీస్‌ సర్వీస్, లింక్‌ యన్‌ టెక్నాలజీ, డాకీపే, స్పాట్ ‌పే, డైసీలింగ్‌ ఫైనాన్షియల్, హువాహు ఫైనాన్షియల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ల పేర్లతో ఆర్‌ఓసీలో రిజిస్టర్‌ చేశారు. ఇవన్నీ కూడా ఆన్‌ లైన్‌ లో వివిధ ఈ– కామర్స్‌ వెబ్‌ సైట్లు నడుపుతున్నాయి. వీటి ముసుగులో కలర్‌ ప్రిడెక్షన్‌ గేమ్‌ ను వ్యవస్థీకృతంగా సాగిస్తున్నారు.

ఈ గేమ్ ‌కు సంబంధించిన పేమెంట్‌ గేట్‌ వే అయిన పేటీఎం, గూగుల్‌ పేల ద్వారా లావాదేవీలు జరిగాయి. బెట్టింగ్‌ కు సంబంధించిన డబ్బు డాకీ పే, లింక్‌ యన్‌ సంస్థలకు వెళ్ళింది. అక్కడ నుంచి హెచ్‌ఎస్‌బీసీ బ్యాంకు ఖాతాలోకి వెళ్ళినట్లు ఈడీ అధికారులు చెప్తున్నారు. ఇది అంతర్జాతీయ బ్యాంకు కావడంతో ఆ ఖాతాల్లోని నగదు హంకాంగ్, సింగపూర్‌ ల్లోని కొన్ని ఖాతాల్లోకి మళ్ళినట్లు తేల్చారు. ఇలా రూ.1100 కోట్ల టర్నోవర్‌ లో రూ.110 కోట్లు వెళ్ళినట్లు ఆధారాలు లభించాయి. మిగిలిన మొత్తం కూడా విదేశాలకే తరలించేసి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే హెచ్‌ ఎస్ ‌బీసీ బ్యాంకులోని నాలుగు ఖాతాల్లో ఉన్న రూ.46.96 కోట్లను ఈడీ ్రïఫీజ్‌ చేసింది. ఈ  వ్యవహారంలో మనీలాండరింగ్‌ ను నిగ్గు తేల్చడానికి ఈడీ రంగంలోకి దిగింది
Tags:    

Similar News