జలుబు కరోనాకు రక్షణకవచం.. షాకింగ్​ నిజం

Update: 2020-10-08 02:30 GMT
ప్రస్తుత విపత్కర పరిస్థితిలో మనకు జలబు చేసినా, దగ్గు వచ్చినా, తుమ్ములు వచ్చినా తీవ్ర ఆందోళన చెందుతున్నాం. వామ్మో ఒక వేళ కరోనా అయ్యి ఉంటుందేమోనని భయపడుతున్నాం. జలుబు చేసిన వాళ్లు కనిపిస్తే  ఇతరులైనా  కుటుంబసభ్యులైనా  దూరంగా ఉంటున్నాం. అయితే ప్రస్తుతం కొందరు వైద్య నిపుణులు మాత్రం సాధారణ జలుబు కరోనాను నియంత్రిస్తుందని చెబుతున్నారు. మనకొచ్చే సాధారణ జలుబు కరోనా నుంచి మనల్ని రక్షిస్తుందని తేల్చిచెబుతున్నారు సైంటిస్ట్‌లు. సాధారణంగా రిహినోవైరస్​ మూలంగా శరీరానికి జలుబు చేస్తుంది. అయితే రిహినోవైరస్​ బాడీలోకివస్తే దానివల్లే బాడీలో యాంటీవైరల్ వ్యవస్థ ఉత్తేజం అవుతుందని చెబుతున్నారు.

 ఇది యాంటీ వైరల్ వ్యవస్థ కరోనాను నియంత్రిస్తుంది. యాలే యూనివర్సిటీ పరిశోధకులు ఈ విషయాన్ని స్పష్టం చేశారు. జలుబుకు కారణమైయ్యే రిహినో వైరస్​.. యాంటీ వైరల్ ఏజెంట్ ఇంటర్​ ఫెరాన్​ ఉత్పత్తి చేస్తుందని చెప్పారు. అయితే దీనివల్ల కామన్​ కోల్డ్​ వైరస్​ను అడ్డుకోవడానికి సెల్స్​ చుట్టూ యాంటీ వైరల్ రక్షణ ఏర్పాటుచేస్తుంది. అంటే ముక్కు నుంచి ఊపిరితిత్తుల వరకు లైనింగ్ వేస్తుంది. ఇదే రక్షణ కవచం. ఎక్కడైతే వైరస్ లు ఎదుగుతాయో అక్కడే ఈ సెల్స్ లైనింగ్ ను ఏర్పాటుచేస్తాయి. కరోనాకు వ్యతిరేకంగా ఇంటర్​ఫెరాన్​ పనిచేస్తుంది. సెల్స్ మీద కోటింగ్‌ లా వాడారు. అప్పుడు కరోనాకు కారణమైయ్యే వైరస్‌ ను ఈ లైనింగ్ అడ్డుకుంది. ఇది కరోనాకు అడ్డకుంటుందని వైద్యులు చెబుతున్నారు. కాబట్టి జలుబు వస్తే చాలు.. కరోనా అని భ్రమలు తగ్గించు కోవడమే మేలు.
Tags:    

Similar News