కేసీఆర్ నిర్ణయానికి ఆ పెద్దాయన ఫిదా.. పొగిడేస్తూ లేఖ రాశారు
అనూహ్యనిర్ణయాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంటారు తెలంగాణరాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. కర్నల్ సంతోష్ బాబు వీర మరణం నేపథ్యంలో ఆయన స్పందించిన తీరు తెలంగాణ ప్రజల్ని మాత్రమే కాదు.. యావత్ దేశ ప్రజల్ని ఆకర్షించారు. అభినందనలు పొందారు. కేవలం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సంతోష్ కు మాత్రమే కాదు.. ఆయనతో మరణించిన మిగిలిన 19 మందికి కూడా సాయాన్ని ప్రకటించటం ద్వారా సరికొత్త అలవాటుకు తెర తీశారని చెప్పాలి.
ఇదిలా ఉంటే.. సీఎం కేసీఆర్ తీరు బాగుందన్న పొగడ్త పలువురి నోట వినిపించటం తెలిసిందే. సంతోష్ బాబు ఎపిసోడ్ లో కేసీఆర్ స్పందించిన వేగం.. అందించిన సాయం పలువురిని కదిలించింది. సారుచర్యపై తాజాగా నావికా దళం డిప్యూటీ చీఫ్ వైస్ అడ్మిరల్ పవార్ లేఖ రాశారు. అందులో సీఎం కేసీఆర్ తీరును అభినందించారు. ఆయనకు థ్యాంక్స్ చెప్పటం గమనార్హం.
‘‘ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించిన తీరు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు అనుసరించేలా ఉంది. దేశాన్ని రక్షించేందుకు భారత సైనికులు ఎప్పుడూ వెనుకాడలేదు. అమరులైన ఎందరో సైనికుల్ని జాతి గుర్తు పెట్టుకుంది. మీ చర్య ప్రతి ఒక్కరిని కదిలించేలా ఉంది. దేశం కోసంప్రాణ త్యాగానికైనా సిద్ధమయ్యేలా చేసింది. దేశం కోసం తాము మరణిస్తే.. తమ కుటుంబానికి యావత్ జాతి అండగా నిలుస్తుందన్న సందేశాన్ని ఇచ్చినట్లైంది. సంతోష్ తో పాటు మరణించిన మిగిలిన 29 మందికి సాయం ప్రకటించటం గొప్ప విషయం’’ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
నావికా దళానికి చెందిన పెద్ద మనిషి.. సీఎం కేసీఆర్ తీరును పొగిడేయటం చూస్తే.. ఎప్పుడేం చేస్తే మైలేజీ తో పాటు.. అందరి మనసుల్ని దోచుకోవటం ఎలానో ఇట్టే అర్థం కాక మానదు. ఆసక్తి కరమైన విషయం ఏమంటే.. ఈ మొత్తం ఎపిసోడ్ లో కేసీఆర్ కుమార్తెకవిత చాలా కీలక పాత్ర పోషించినట్లుగా ఆయన తన లేఖలో పేర్కొంటూ.. ఆమె కు అభినందనలు తెలిపిన తీరు చూస్తే.. బ్యాక్ ఎండ్ లో ఉండి కవిత అంత పని చేశారా? అన్న భావన కలుగక మానదు.