• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ప్రధాని మోడీకి సీఎం...

ప్రధాని మోడీకి సీఎం కేసీఆర్ ఇచ్చిన కరోనా సలహాలేంటి?

By - Tupaki Desk
Update: 2020-03-21 07:01 GMT
మిగిలిన విషయాల్లో ఎలా ఉన్నా.. కొన్ని విషయాల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను అభినందించాల్సిందే. తనకు అవగాహన లేని అంశం మీద పూర్తి స్థాయి పట్టు తెచ్చుకునేందుకు పడే తపన.. చేసే ప్రాక్టీస్ అంతా ఇంతా అన్నట్లు ఉండదు. తనను తాను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకునేందుకు ఏ మాత్రం మొహమాటపడరు. కొద్ది రోజుల క్రితం మీడియాతో మాట్లాడిన సందర్భంలో కరోనా మీద తనకున్న అవగాహన తక్కువేనని.. తనకు ఒక సైంటిస్టు ఫోన్ చేసి మాట్లాడినట్లుగా చెప్పారు.

కట్ చేస్తే.. రెండు రోజుల క్రితం కరోనా పై అత్యవసర రివ్యూ సమావేశాన్ని ఏర్పాటు చేసిన ఆయన.. అనంతరం మీడియాను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా కేసీఆర్ ను నిశితంగా పరిశీలిస్తే.. తొలి ప్రెస్ మీట్ కు.. మలి ప్రెస్ మీట్ వరకూ చూస్తే..కరోనా మీద ఆయన సాధించిన పట్టు స్పష్టంగా కనిపించటమే కాదు.. ఏమేం చేయాలి? ఎలా చేయాలి? ఏ అంశానికి ఎంత మాత్రం స్పందించాలి? లాంటి విషయాల్లో తనకున్న సాధికారితను తన మాటలతోనే చెప్పేశారు.

తాజాగా దేశ వ్యాప్తంగా ఉన్న ముఖ్యమంత్రులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ల ద్వారా భేటీ కావటం తెలిసిందే. కరోనా వ్యాప్తి అంతకంతకూ పెరుగుతున్న వేళ.. ఏమేం చేయాలన్న దాని పై  చర్చ జరిగింది. ఈ సందర్భంగా రోజురోజుకీ పెరుగుతున్న పాజిటివ్ కేసుల ప్రస్తావనతో పాటు.. కరోనా నిర్దారణ పరీక్షలకు తాకిడి ఎక్కువ అవుతున్న అంశాలు చర్చకు వచ్చాయి. ఇలాంటివేళ.. ప్రధాని మోడీకి సలహా ఇచ్చే ప్రయత్నం చేశారు సీఎం కేసీఆర్.

తాను ఏ విషయం మీద మాట్లాడినా.. పూర్తి పట్టు ఉంటే తప్పించి.. అనవసరమైన సంభాషణలు చేసే అలవాటు లేని కేసీఆర్.. అందుకు తగ్గట్లే ఆయన తాజా సలహా ఉందంటున్నారు. ఒక విధంగా చూస్తే.. ప్రధాని మోడీ మీద భారాన్ని తగ్గించేలా సదరు ఐడియా ఉందని చెప్పాలి. కరోనా పరీక్షలు నిర్వహించేందుకు వీలుగా హైదరాబాద్ లో ఉన్న సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయోలజీ సింఫుల్ గా చెప్పాలంటే.. సీసీఎంబీని వినియోగించుకుంటే బాగుంటుందన్న అభిప్రాయాన్ని ఆయన వెల్లడించారు.

నిర్దారణ పరీక్షలు ఒక్క తెలంగాణ రాష్ట్రానికే కాదు.. ఇతర రాష్ట్రాల వారు కూడా వినియోగించుకునే వీలుందని.. కేంద్రం అధీనంలో పని చేసే ఈ సంస్థలో ఒకేసారి వెయ్యి శాంపిల్స్ పరీక్షించే సత్తా ఉందన్న విషయాన్ని గుర్తు చేశారు. నిజానికి.. రోజురోజుకి పెరుగుతున్న కరోనా నిర్దారిత పరీక్షల భారం ల్యాబుల మీద పడుతున్న వేళ.. ప్రధాని మోడీకి సీఎం కేసీఆర్ ఇచ్చిన సలహా సాయం చేస్తుందని చెప్పక తప్పదు. మరి.. సారు ఇచ్చిన సలహా మీద ప్రధాని ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
Tags:    
  • Cm Kcr Given Advice To Pm Modi 
  • Telangana Cm Conference Call To Prime Minister narendra Modi 
  • Latest Corona News 
  • Latest Telangana News 

Similar News

పిచ్చికుక్క కరిచిందా.. ఎర్రగడ్డకు పంపిస్తాం.. కోమటిరెడ్డికి రేవంత్ రెడ్డి పరోక్ష పంచ్.. కాంగ్రెస్‌లో మాటల మంటలు

2026-11-19 21:30 GMT

విశాఖ నుంచి తిరుపతి వెళ్ళే భక్తులకు సూపర్ న్యూస్

2026-11-19 21:15 GMT

సీనియర్లను రంగంలోకి దించిన జనసేన

2026-11-19 21:15 GMT

ఎవరు గెలిచినా మేమే...వైసీపీ అలా తృప్తి పడుతోందా ?

2026-11-19 21:12 GMT

మంత్ర్రుల‌ను కాద‌న‌లేరు.. కార్య‌క‌ర్త‌ల‌ను వ‌ద్ద‌న‌లేరు: బాబుకు చిక్కులు

2026-11-19 21:12 GMT

పెరిగే సీట్లు వైసీపీ రాజకీయాన్ని ముంచేస్తాయా ?

2026-11-19 21:11 GMT

మలేషియా గేట్లు మూసేసింది.. భారతీయులకు ఇక వీసా కష్టాలు.. అసలు కారణమిదే..

2026-11-19 21:10 GMT

కొలువు తీరిన ఎంపీపీలు...రికార్డు స్థాయిలో పదవులు

2026-11-19 21:01 GMT

మోదీ ప్రస్తావించిన లైసెన్స్ రాజ్ అంటే ఏమిటి? ఏంటా కథ?

2026-11-19 21:00 GMT

'రాష్ట్ర పండుగ' గా రామోజీరావు జయంతి.. ..ప్రభుత్వ నిర్ణయంపై భిన్న వాదనలు ఇవే !

2026-11-19 20:57 GMT

మూడు ముళ్ల బంధం.. రూ. 7.50 లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యం!

2026-11-19 19:30 GMT

వీఐపీలు వస్తేనే ముంబైకి అందం.. సామాన్యులు ఉంటే ఎందుకీ దుర్గంధం?

2026-11-19 18:30 GMT

Copyright @2026

Powered by Blink CMS