ఎమ్మెల్యేలకు అన్ లిమిటెడ్ కోట్ల ఆఫర్.. సీఎం సంచలనం
రాజస్థాన్ లో రాజకీయం రసకందాయంలో పడింది. ఆగస్టు 14 నుంచి రాజస్థాన్ అసెంబ్లీ సమావేశమవుతుండడం.. బలపరీక్షకు అవకాశం ఇవ్వడంతో ఒక్కో ఎమ్మెల్యేకు రేటు భారీగా పెరిగిపోతోందని స్వయంగా రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్ విమర్శించారు. ఇప్పటివరకు ఒక్కో ఎమ్మెల్యేకు అడ్వాన్స్ గా రూ.10కోట్లు.. రెండో విడతగా రూ.15కోట్లు ఇస్తామని ఆఫర్ చేశారని ఆరోపించారు. ఇప్పుడు అసెంబ్లీ టైం దగ్గరపడుతున్న కొద్ది ఎన్ని కోట్లు కావాలో చెప్పండని ఆఫర్ ఇస్తున్నారని రాజస్థాన్ సీఎం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదంతా బీజేపీ చేస్తోందంటూ రాజస్థాన్ సీఎం గహ్లోత్ పరోక్ష ఆరోపణలు చేశారు.
200 సభ్యులున్న రాజస్థాన్ అసెంబ్లీలో కాంగ్రెస్ కు 107మంది సభ్యులున్నారు. సచిన్ పైలెట్ 19మంది ఎమ్మెల్యేలతో తిరుగుబాటు చేశారు. దీంతో రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం ఏర్పడింది.
ఆగస్టు 14న వారంతా అసెంబ్లీకి హాజరై బలపరీక్షలో పాల్గొంటారు. కాగా 6 బీఎస్పీ ఎమ్మెల్యేలను సీఎం అశోక్ తన కాంగ్రెస్ లో కలిపేయగా.. బీఎస్పీ పార్టీ హైకోర్టుకెక్కింది. దీంతో కోర్టు స్పీకర్ కు నోటీసులు జారీ చేసింది.