• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  అలా విడుదలై ఇలా అరెస్ట్...

అలా విడుదలై ఇలా అరెస్ట్ అయిన చెవిరెడ్డి

By - Tupaki Desk
Update: 2016-07-09 08:21 GMT
చిత్తూరు జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి టైం ఏమాత్రం బాగున్నట్లుగా అనిపించట్లేదు. పెద్ద.. పెద్ద రైళ్లను తగలబెట్టిన వారు సైతం బెయిల్ మీద రిలీజ్ అయి బయటకు వస్తున్న వేళ.. సబ్ కలెక్టరేట్ వద్ద నిరసన ప్రదర్శన చేసినందుకే అరెస్ట్ కావటం చెవిరెడ్డి స్పెషాలిటీ ఏమో..? సబ్ కలెక్టరేట్ లో రాత్రివేళ జరిపిన నిరసన ప్రదర్శన కారణంగా ప్రభుత్వ ఉద్యోగుల విదులకు ఆటంకం కలిగించారంటూ ఆయనపై కేసు నమోదు చేయటం.. కోర్టు ఆయనకు 15 రోజులు రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. దీంతో.. ఆయన్ను జిల్లా జైలుకు తరలించారు. ఈ ఉదంతంపై తాజాగా ఆయనకు బెయిల్ వచ్చి విడుదల అయ్యారు.

విచిత్రమైన విషయం ఏమిటంటే.. జైలు నుంచి అలా బయటకు వచ్చిన చెవిరెడ్డిని.. మళ్లీ వెంటనే మరో కేసు విషయమై అరెస్ట్ చేసిన పోలీసుల తీరుతో ఆయనతో పాటు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు సైతం షాక్ కు గురైన పరిస్థితి. వడమాలపేట పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులో బెయిల్ మీద విడుదలైన చెవిరెడ్డిని.. ఎంఆర్ పల్లి పోలీసులు.. తమ స్టేషన్ పరిధిలో చెవిరెడ్డిపై మరో కేసు ఉందని చెబుతూ ఆయన్ను అదుపులోకి తీసుకోవటం గమనార్హం. ఊహించని విధంగా పోలీసులు వ్యవహరించిన వైఖరి చెవిరెడ్డి బ్యాచ్ కు భారీ షాక్ కు గురి చేసిందని చెప్పొచ్చు. దీంతో.. పోలీసుల తీరును నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు జైలు ఎదుట ఆందోళన నిర్వహించారు. పాపం చెవిరెడ్డి జైలు కష్టాలు ఎప్పటికి తీరుతాయో..?
Tags:    
  • Chitoor police 
  • chevireddy bhaskar reddy 

Similar News

బిగ్ అప్టేట్ : రాప్తాడు నిందితుడి కాలు తొలగింపు..

2026-11-03 09:35 GMT

ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో కూటమి హవా.. వైసీపీకి భారీ దెబ్బ

2026-11-03 08:54 GMT

ఒక్క మ్యాచ్ కోసం ఇన్ని రిక్వెస్టులా? 2027 వరల్డ్ కప్‌లో ఇండియా-పాక్ క్రేజ్ మామూలుగా లేదుగా!

2026-11-03 08:21 GMT

మిడ్ టర్మ్ ఎన్నికల వేళ ఇరాన్‌పై అమెరికా రహస్య దాడి.. మళ్లీ యుద్ధమేఘాలు.. ఎందుకిలా చేసింది?

2026-11-03 07:23 GMT

అమెరికాకే మోస్ట్ వాంటెడ్ గా మారిన ఉత్తరకొరియా అత్యంత ప్రమాదకరమైన హ్యాకర్ కథ

2026-11-03 06:56 GMT

అమెరికా సెనేట్‌లో డెమోక్రాట్లు గెలిచే అవకాశం 75 శాతం.. ట్రంప్ కు ఇది షాకే..

2026-11-03 06:05 GMT

అది పాస్‌పోర్ట్ బుక్ లేదా ఫోన్ డైరీనా.. రెన్యూవల్ ఆఫీసర్ కి షాక్ ఇచ్చిన వ్యక్తి!

2026-11-03 06:04 GMT

పోలింగ్ రోజు ఆందోళన.. జగన్‌కు పోలీసుల షాక్.. కేసు నమోదు

2026-11-03 05:38 GMT

Grok AI నిర్వహణ ఖర్చులు తలకుమీదకు.. ఆదాయం కంటే ఖర్చులే ఎక్కువంటున్న ఎలాన్ మస్క్!

2026-11-03 05:38 GMT

ఈజిప్టు హైవేపై డిజిటల్ బిల్‌బోర్డ్ హ్యాక్.. అశ్లీల వీడియోలతో వాహనదారులకు షాక్!

2026-11-03 05:37 GMT

విదేశీ...స్వదేశీ : మోడీ వర్సెస్ రాహుల్ !

2026-11-03 04:12 GMT

ఎన్నికల రాష్ట్రాలలో భారీగా ఓట్ల కోత... విపక్షాలు గగ్గోలు

2026-11-03 04:11 GMT

Copyright @2026

Powered by Blink CMS