• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  బాలుడిపై ధూషించి.....

బాలుడిపై ధూషించి.. నాలుకతో బూట్లు తూడిపించి..: యూపీలో దారుణం

By - Tupaki Desk
Update: 2022-04-20 00:30 GMT
ఓ వైపు టెక్నాలజీతో ప్రపంచం దూసుకుపోతుండగా.. దేశంలో కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇంకా కుల వవివక్ష కొనసాగుతూనే ఉంది. కొందరు నిమ్నకులాల వారిపై అగ్ర కులాలకు చెందిన వారు ఇష్టమొచ్చిన రీతిలో ప్రవర్తిస్తున్నారు. అమాయక పేదలు అని చూడకుండా.. వారిని కష్టపెడుతూ.. అవమానిస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారు.

తాజాగా ఉత్తరప్రదేశ్లోని ఓ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఓ మైనర్ ను కొందరు యువకులు దారుణంగా అవమానిస్తూ హింసించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. అయితే ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు సదరు నిందితులను అరెస్టు చేసి జైల్లో పెట్టారు. ఏప్రిల్ 10న  ఈ సంఘటన జరగగా కొన్ని రోజుల తరువాత సోషల్ మీడియాలో వైరల్ కావడం చర్చనీయాంశంగా మారింది.

ఉత్తరప్రదేశ్లో రాయబరేలిలో జరిగిన ఈ సంఘటన కలకలం రేపింది. 2 నిమిషాల 30 సెకన్లు ఉన్న ఈ వీడియోలో ఓ బాలుడు తన చెవులు పట్టుకొని గుంజీలు తీస్తున్నాడు. కొందరు మోటార్ బైక్ పై కూర్చొని ఆ బాలుడిని ధూషిస్తున్నారు. భయంతో వణుకిపోతున్న ఆ బాలుడిని చూసిన వాళ్లు పైశాచికంగా నవ్వుతున్నారు. అంతేకాకుండా ఆ బాలుడితో బైక్ పై కూర్చున్నవారు తమ బూట్లను నాలుకతో నాకించారు. అయితే ఆ బాలుడు దళిత వర్గానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. బాలుడిని అవమానించిన వారు అగ్ర వర్ణాలకు చెందిన వారని సమాచారం.

ఏప్రిల్ 10న జరిగిన ఈ సంఘటన తరువాత బాలుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో ఏడుగురు నిందితులను గుర్తించి వారిని అరెస్టు చేసినట్లు రాయబరేలీ పోలీసులు తెలిపారు. అయితే కొన్ని రోజుల తరువాత ఈ వీడియో సోషల్ మీడియాలోవైరల్ అవుతోందని సినియర్ పోలీసు అధికారి అశోక్ సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు.

ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. పదో తరగతి చదువుతున్న ఆ బాలుడి తండ్రి మరణించాడు. దీంతో తల్లితో కలిసి పొలం పనులు చేశాడు. అయితే వాటికి సంబంధించిన డబ్బులు ఇవ్వాలని వారిని అడగ్గా.. ఇలా హింసించినట్లు పోలీసులకు తెలిపారు.  మమ్మల్నే డబ్బులు అడుగుతావా అని ఆ బాలుడిని ధూషించినట్లు ఆయన పేర్కొన్నారు.

అంతేకాకుండా నిందితుల్లో ఒకరు బాలుడిని పట్టుకొని దాడి చేశాడని, ఆ తరువాత తమ బూట్లను నాకమని బలవంతం పెట్టడంతో ఆ బాలుడు బూట్లను నాలుకతో తూడ్చాడని అన్నారు.  ఈవ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ కావడం చర్చనీయాంశంగా మారింది. మారుమూల గ్రామాల్లో ఇంకా ఇలాంటి సంఘటనలు జరగడం దారుణమని కొందరు దళితనేతలు ఖండిస్తున్నారు. ఇలాంటి వారిపై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.



Full View
Tags:    
  • ChildAbuse 
  • UttarPradesh 
  • SocialMedia 
  • ViralVideo 
  • MinorChildAbused 
  • Rayabareli 
  • PoliceAshokSingh 
  • Delhi 

Similar News

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

Copyright @2026

Powered by Blink CMS