బాబుని టెన్షన్‌ పెడుతున్న ఆ రెండు

Update: 2019-02-22 06:36 GMT
నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేగా అభ్యర్థుల్ని ఫైనల్‌ చేసే పనిలో చంద్రబాబు నాయుడు దిగిపోయారు. దిగడమే ఆలస్యం.. ముందుగా జగన్‌ కు మంచి పట్టున్న రాయలసీమను అందులోనూ కడప జిల్లాను ఎంపిక చేసుకున్నారు. అక్కడి అభ్యర్థుల్ని దాదాపుగా ఖరారు చేసేశారు. ఆ తర్వాత చిత్తూరు జిల్లా. ఈ జిల్లాలో కూడా చాలా నియోజకవర్గాలకు అభ్యర్థుల్ని ఫైనల్‌ చేసిన చంద్రబాబు.. రెండు నియోజకవర్గాల్ని మాత్రం పెండింగ్‌ లో పెట్టారు. అవే పలమనేరు - తంబళ్లపల్లె.

ఇక పలమనేరు నియోజకవర్గం విషయానికి వస్తే..ఇక్కడనుంచి మంత్రి అమర్‌నాథ్‌ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి గెల్చిన అమర్‌ నాథ్‌.. ఆ తర్వాత టీడీపీలో చేరి మంత్రి అయ్యారు. అయితే.. రాబోయే ఎన్నికల్లో పలమనేరు నుంచి పోటీ చేయాలని అమర్‌ నాథ్ రెడ్డికి లేదు. ఎందుకంటే.. పార్టీ మారడంతో..ప్రజలు ఎక్కడ వ్యతిరేక ఓట్లు వేసి ఓడిస్తారో అని భయపడుతున్నారు. యాక్చువల్‌ గా ఆయన పుంగనూరు టిక్కెట్‌ అడిగారు. అయితే.. అక్కడ అమర్‌ నాథ్‌ రెడ్డి మరదలు అనీషారెడ్డికి సీటుని కన్‌ ఫర్మ్‌ చేశారు చంద్రబాబు. ఎందుకంటే.. గత నాలుగేళ్లుగా పుంగనూరు నియోజకవర్గంలో అనీషా రెడ్డి చాలా యాక్టివ్‌ గా ఉన్నారు. అన్నింటికి మించి సర్వేల్లో కూడా అనీషాకు మంచి మార్కులు పడ్డాయి. దీంతో.. అమర్‌ నాథ్‌ రెడ్డి అభ్యర్థనని కాదని.. అనీషా వైపే మొగ్గుచూపారు చంద్రబాబు.

ఇక చంద్రబాబుకి తలనొప్పిగా మారిన రెండో నియోజకవర్గం తంబళ్లపల్లె. ఇక్కడ శంకర్‌ యాదవ్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈయన టీడీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే. దీంతో లెక్క ప్రకారం.. ఈ సీటు ఆయనకే ఇవ్వాలి. కానీ స్థానికంగా నిర్వహించిన సర్వేల్లో శంకర్‌ యాదవ్‌ ఈసారి గెలవడం దాదాపు అసాధ్యం అనే రిపోర్ట్ వచ్చింది. దీంతో.. శంకర్‌ యాదవ్‌ కు టిక్కెట్‌ ఇచ్చి ఎందుకు సిట్టింగ్‌ స్థానాన్ని కోల్పోవాలి అని భావిస్తున్న చంద్రబాబు.. ఒక బలమైన అభ్యర్థి కోసం చూస్తున్నారు. అందుకే.. ఈ సీటు విషయంలో కూడా అభ్యర్థిని ప్రకటించకుండా పోస్ట్‌ పోన్‌ చేశారు.
Tags:    

Similar News