పార్టీ ఆఫీసుకు బాబు ఎందుకు వెళ్లడం లేదు?

Update: 2017-06-29 06:19 GMT
హైటెక్ సీఎం అన్న ట్యాగ్ లైన్ ఉన్నా చంద్రబాబునాయుడు మాత్రం మూఢనమ్మకాలకు విపరీతమైన ప్రాధాన్యమిస్తారు. ముఖ్యంగా ఆయనకున్న వాస్తు పట్టింపుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. తన ఇంటి నుంచి ఆఫీసు వరకు ఆయన వాస్తు ప్రకారం చేసిన మార్పులు అందరికీ తెలిసినవే. ఇప్పుడు కూడా చంద్రబాబు వాస్తు పట్టింపులతో ఏకంగా పార్టీ ఏపీ కార్యాలయానికి రావడమే మానేశారట.
    
ఏపీ టీడీపీ రాష్ర్ట కార్యాలయం గుంటూరులో ఉంది. రెండేళ్ల కిందటే అక్కడ ఈ ఆఫీసు ఏర్పాటు చేశారు. కానీ చంద్రబాబు ఇంతవరకు అక్కడ కాలుమోపింది కేవలం రెండే రెండు సార్లు. ఓ సారి ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు.. మరోసారి ఉగాది పంచాంగ శ్రవణానికి. అంతే... ఆ త‌ర్వాత ఆ ఛాయల్లోనే కనిపించలేదాయన.
    
నిజానికి హైదరాబాద్ నుంచి పార్టీ కార్యకలాపాలు సాగిన రోజుల్లో ఆయన అప్పటి పార్టీ ఆఫీసు ఎన్టీఆర్ ట్ర‌స్ట్ భ‌వ‌న్‌ కు వారానికి మూడు - నాలుగు సార్లు వ‌చ్చేవారు. సీఎంగా ఉన్నప్పుడు కూడా వారంలో కనీసం రెండు సార్లయినా వచ్చేవారు. అయితే ఇప్పుడు మాత్రం ఏపీ పార్టీ ఆఫీసుకు ఆయన రావడం లేదు. దీనికి వాస్తు భయాలే కారణమని తెలుస్తోంది.
    
గుంటూరు పార్టీ కార్యాల‌యం వాస్తు బాగోలేద‌ని కొంద‌రు చంద్రబాబుకు చెప్పడంతో ఆయన అటువైపు కనీసం కన్నెత్తి కూడా చూడడం లేదని తెలుస్తోంది. అక్క‌డికి రెండుసార్లు వెళితేనే పార్టీప‌రంగా,కేసుల ప‌రంగా ఇబ్బందులు వ‌చ్చాయ‌ని చెప్పార‌ట‌.. దీంతో చంద్రబాబు అటువైపు వెళ్లడం మానేశారు. ప్రత్యామ్నాయంగా  లింగ‌మ‌నేని గెస్ట్‌హాస్ ప‌క్క‌నే పార్టీ కార్య‌క‌లాపాల  కోసం కొత్త భవనం నిర్మించబోతున్నట్లు సమాచారం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News