చంద్రబాబు.. పిరికి రాజును గుర్తు చేస్తున్నారా?
'మీకు ధైర్యం లేకపోతే నా చుట్టూ పడుకోండి..' అన్నాడట వెనుకటికి ఒక పిరికి రాజు. తను భయపడుతూ.. దాన్ని కవర్ చేసుకోవడానికి ఆ రాజు అలా అనే వాడట. ఇప్పుడు చంద్రబాబు నాయుడు తీరు కూడా అలానే ఉందని అంటున్నారు రాజకీయ పరిశీలకులు.
తన బేలతనాన్ని తరచూ చాటుకొంటూ ఉంటారు చంద్రబాబు నాయుడు. తన చుట్టూ వాళ్లు తన చుట్టూ వలయంగా ఏర్పడాలని, తనను ఎవరైనా ఏమైనా అంటే అంతా తిరగబడాలని.. తనను కాపాడుకోవాలని చంద్రబాబు నాయుడు తరచూ వ్యాఖ్యానిస్తూ ఉంటారు.
తెలంగాణలో ఓటుకు నోటు కేసులో చిక్కుకున్నప్పటి నుంచి చంద్రబాబు నాయుడు ఇలా మాట్లాడుతూనే ఉన్నారు. ఇలాంటి క్రమంలో చంద్రబాబు నాయుడు మరోసారి తన బేలతనాన్ని చాటుకుంటున్నారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు.
అందుకు నిదర్శనమే .. చంద్రబాబు నాయుడు కేంద్రంలో బీజేపీ వ్యతిరేక పక్షాలు అన్నీ ఒక గొడుగు కిందకు రావాలంటూ వ్యాఖ్యానిస్తూ ఉండటం.
ఏ రాజకీయ పార్టీ కూడా ఎన్నికల ముందు ఏమీ మాట్లాడకూడదనే అనుకుంటోంది. ఆ పార్టీలన్నీ నింపాదిగానే ఉన్నాయి. 'ఫలితాలు రానీ.. చూద్దాం..' అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు సదరు నేతలంతా. ఫలితాలు వచ్చాకా.. ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయనేదాన్ని బట్టి ఎవరి స్థానం ఏమిటో డిసైడ్ చేద్దామన్నట్టుగా ఆ పార్టీలన్నీ ఆ పనిలో ఉన్నాయి.
అయితే చంద్రబాబు నాయుడు మాత్రం ఫలితాలు రాకుండే కూటములు కట్టాలని, పీఎం అభ్యర్థిని డిసైడ్ చేయాలని అంటూ ఉన్నారు. ఇప్పటికే ఈ విషయంలో డేట్ కూడా ప్రకటించారాయన.
అయితే ఆ ప్రతిపాదనను ఎవరూ ఒప్పుకోవడం లేదు. బాబు చేసిన ప్రతిపాదన పట్ల బీజేపీ వ్యతిరేక పార్టీల నేతలెవరూ ఆసక్తి చూపడం లేదు. బాబు తన బేలతనం కొద్దీ ఫలితాలకు ముందే హడావుడి చేయాలని చూస్తున్నారు. అయితే మిగతా వారు మాత్రం ఫలితాలు రానీ చూద్దామని అంటున్నారు. దీంతో చంద్రబాబుకు జాతీయ రాజకీయంలో కూడా ఎదురుదెబ్బ తగులుతున్నట్టుందని విశ్లేషకులు అంటున్నారు.