• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  కుప్పంపై బాగా పట్టుదలగా...

కుప్పంపై బాగా పట్టుదలగా బాబు

By - Tupaki Desk
Update: 2022-01-09 06:50 GMT
చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవటమనే సామెత చంద్రబాబునాయుడుకు బాగా అతుకుతుంది. స్ధానికసంస్ధల ఎన్నికలకు సంబంధించి కుప్పం నియోజకవర్గంలో పార్టీ తుడిచిపెట్టుకుపోయిన తర్వాత ఇపుడు నేతలపై మండిపడుతున్నారు. పరువుపోయిందంటున్నారు. నమ్మినవాళ్ళు నట్టేట ముంచారని గోల చేస్తున్నారు. 35 ఏళ్ళు పాత మొహాలే తీప్ప కొత్త ముఖాలు ఎందుకు కనబడటంలేదంటు మండిపోతున్నారు. కోవర్టులను ఏరేస్తానని, పార్టీని ప్రక్షాళన చేస్తానని ఇపుడు చెబుతున్నారు.

చంద్రబాబు ఇపుడు చెప్పినవన్నీ ద్వితీయ శ్రేణి నేతలు చాలా సంవత్సరాలుగా చెబుతున్నా పట్టించుకోలేదు. నియోజకవర్గంలో కొందరు కీలకనేతలు వైసీపీ నేతలతో చేతులు కలిపి వ్యాపారాలు చేసుకుంటున్నారని ఎప్పటినుండో ఆరోపణలున్నాయి. ఈ విషయాలను చెప్పినా చంద్రబాబు పట్టించుకోలేదు.  ఐదారుమంది నేతలే మొత్తం నియోజకవర్గాన్ని సాశిస్తున్నారని, ద్వితీయ శ్రేణి నేతలు, క్యాడర్ ను దెబ్బతీస్తున్నారనే ఆరోపణలను చంద్రబాబు ఏమాత్రం పట్టించుకోలేదు.

చంద్రబాబుపై ద్వితీయ శ్రేణి నేతలు, కార్యకర్తల్లోనే కాదు జనాల్లో కూడా వ్యతిరేకత పెరుగుతోందని హెచ్చరించినా లెక్కచేయలేదు. దాని ఫలితం మొన్నటి ఎన్నికల మొదటి రెండు రౌండ్లలోనే కనబడింది. నియోజకవర్గాన్ని ఐదారుమందికి అప్పగించేసి చంద్రబాబు కళ్ళు మూసుకుని కూర్చున్నారు. వచ్చిన అవకాశంతో వాళ్ళు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు.  దాని ఫలితమే స్ధానికసంస్ధల ఎన్నికల్లో కనబడింది.

ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఐదారుమంది నేతలపై మిగిలిన నేతలు చంద్రబాబు సమక్షంలోనే తీవ్రమైన ఆరోపణలు చేసి కొట్టినంతపని చేశారు. దాంతో వాళ్ళు రాజీనామాలు చేసి కొత్త వాళ్ళకు అవకాశం ఇవ్వాలని అందరిముందే చంద్రబాబుకు చెప్పారు. అయితే చంద్రబాబు మాత్రం రాజీనామాలను యాక్సెప్ట్ చేయకుండా మిగిలిన వాళ్ళు వ్యతిరేకిస్తున్నా మళ్ళీ వాళ్ళకే బాధ్యతలు అప్పగించారు. దాంతో వాళ్ళు మరింతగ రెచ్చిపోయారు. ఐదారుమందిపై ఎవరెన్ని ఫిర్యాదులు చేసినా చంద్రబాబు పట్టించుకోరనే సిగ్నల్స్ వెళ్ళిపోయాయి.

దాంతో కాస్త బలమున్న ద్వితీయ శ్రేణినేతలు, క్యాడర్ పార్టీని వదిలేసి వైసీపీలోకి వెళిపోయారు. పార్టీలోనే ఉన్న కొద్దిమంది నేతలు చంద్రబాబు మీద కోపంతోనే వైసీపీకి పనిచేశారు. దాంతో మొత్తం పార్టీ వ్యవస్ధే కుప్పకూలిపోయింది. అంతా అయిపోయినాక ఇపుడు కీలకమైన నేతలపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీన్నికూడా చాలామంది నేతలు నమ్మటంలేదు. చంద్రబాబు ఎప్పుడూ ఇలాగే మాట్లాడుతారని కానీ సమయం వచ్చేసరికి మళ్ళీ ఆ ఐదారుమందినే నెత్తినెక్కించుకుంటారని అంటున్నారు. కాబట్టి జరిగిన తప్పులో చంద్రబాబుదే మేజర్ పాత్ర. అంతా అయిపోయిన తర్వాత పరువుపోయిందని ఇపుడు గోల చేయటంలో అర్ధమేలేదు.
Tags:    
  • Nara Chandrababu naidu 
  • TDP 
  • Andhrapradesh 
  • Latest News 
  • Telugu News 
  • Tupaki Updates 

Similar News

వీఐపీలు వస్తేనే ముంబైకి అందం.. సామాన్యులు ఉంటే ఎందుకీ దుర్గంధం?

2026-11-19 18:30 GMT

సహచరుల వద్ద తలెత్తుకోలేకపోతున్నా.. ఇప్పుడే వైసీపీలోకి వెళ్లిపోండి! – టీడీపీ ఎమ్మెల్యే థామస్ సంచలన వ్యాఖ్యలు

2026-11-19 17:30 GMT

AI హడావుడి.. సినిమాకు ఒరిగిందేంటి!

2026-11-19 17:30 GMT

పార్టీలు, ఫంక్షన్లు జరగాలంటే ఆ రూల్స్ పాటించాలా?

2026-11-19 16:30 GMT

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

Copyright @2026

Powered by Blink CMS