• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  బాబుకు కష్టమేనట!?

బాబుకు కష్టమేనట!?

By - Tupaki Desk
Update: 2018-11-01 05:56 GMT
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిస్థితి నానాటికీ దిగజారుతున్నట్లుగానే కనిపిస్తోంది. ఆయనకు పార్టీ నుంచి వచ్చిన సర్వేలు కాని - ఇంటెలిజెన్సీ నుంచి వచ్చిన సర్వేలు కాని - స్వకులం వారి సర్వేలు కాని అనుకూలంగా లేవని తాజా నివేదికలను బట్టి తెలుస్తోందని అంటున్నారు. ముఖ్యంగా ప్రతిపక్ష నేత - వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డిపై జరిగిన కత్తి దాడిని తమకు అనుకూలంగా మలచుకోవాలనుకున్న చంద్రబాబు నాయుడు - తెలుగుదేశం పార్టీ నాయకులకు ఎదురుదెబ్డే తగిలిందంటున్నారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులపై తనకు నమ్మకం లేదన్న ప్రతిపక్ష నేత వ్యాఖ్యలను కూడా రాజకీయం చేయాలనుకున్న చంద్రబాబు నాయుడు - తెలుగుదేశం పార్టీ నాయకులకు ప్రజల నుంచి ఎదురు దెబ్బే తగులుతోందంటున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకుడి క్యాంటిన్ లో పని చేస్తున్న వ్యక్తి దాడి చేసే దాన్ని ప్రతిపక్షం పైనే వేయాలనుకోవడం కూడా ప్రజలకు నచ్చలేదని అంటున్నారు. పోలీసుల దర్యాప్తులో వచ్చిన వివరాలను ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి పోలీసు పెద్దలు వివరిస్తున్నారని సమాచారం. ఈ నివేదికల్లో తెలుగుదేశం ప్రభుత్వానికే మచ్చ తెచ్చే విధంగా వాస్తవాలున్నాయంటున్నారు. ఇందుకే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు - ఆయన పార్టీ నాయకులు వివిధ సభల్లోనూ - చర్చా వేదికల్లోనూ పొంతన లేని వ్యాఖ్యలు చేస్తున్నారంటున్నారు.

పాదయాత్ర సందర్భంగా చాలా సందర్భాలలో ప్రతిపక్ష నేత చేసిన ప్రసంగాలు - అసాధ్యాలను సుసాధ్యం చేస్తామంటూ ప్రకటించకపోవడంతో ఆయన మాటలకు ఆంధ్రప్రదేశ్ లో నానాటికి విలువ పెరుగుతోందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ పోలీసులపై తనకు నమ్మకం లేదని ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కూడా విలువ పెరిగిందంటున్నారు. "జగన్ చేసిన వ్యాఖ్యలు ఎంతో పరిణితి చెందినవి. ఆయన పోలీసులపైనే నమ్మకం లేదన్నారు కాని.... పోలీసు వ్యవస్ధపై అనలేదు. అంటే దీనర్ధం ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఓ వ్యవస్ధకు అనుగుణంగా కాకుండా ఓ వ్యక్తికి అనుగుణంగా పని చేస్తున్నారని తేలిపోయింది " అని సీనియర్ జర్నలిస్టు వ్యాఖ్యానించారు. ఈ విషయం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా స్పష్టమైందని - అందుకే అన్ని జిల్లాల్లోనూ కూడా తెలుగుదేశం పార్టీ పట్ల వ్యతిరేకత వస్తోందని అంటున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో వచ్చే ఎన్నికలు చంద్రబాబు నాయుడికి కష్ట కాలంగానే పరిగణించాలని అంటున్నారు.

Tags:    
  • Chandrababu naidu 
  • Attack on Jagan 
  • Telugu News 

Similar News

వీఐపీలు వస్తేనే ముంబైకి అందం.. సామాన్యులు ఉంటే ఎందుకీ దుర్గంధం?

2026-11-19 18:30 GMT

సహచరుల వద్ద తలెత్తుకోలేకపోతున్నా.. ఇప్పుడే వైసీపీలోకి వెళ్లిపోండి! – టీడీపీ ఎమ్మెల్యే థామస్ సంచలన వ్యాఖ్యలు

2026-11-19 17:30 GMT

AI హడావుడి.. సినిమాకు ఒరిగిందేంటి!

2026-11-19 17:30 GMT

పార్టీలు, ఫంక్షన్లు జరగాలంటే ఆ రూల్స్ పాటించాలా?

2026-11-19 16:30 GMT

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

Copyright @2026

Powered by Blink CMS