పవన్ కళ్యాణ్ కు చంద్రబాబు సవాల్

Update: 2017-03-16 12:42 GMT
ఏపీ సీఎం చంద్రబాబు - జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మధ్య ముసుగులో గుద్దులాటకు తెరపడే సమయం ఆసన్నమైంది. ఇక ఇద్దరి మధ్య పోరుకు బహిరంగం కానుందని తెలుస్తోంది. గత ఎన్నికల్లో బీజేపీ - టీడీపీల కోసం ప్రచారం చేసిన పవన్ కొంతకాలంగా వారితో విభేదిస్తూ సొంత పార్టీ పెట్టుకుని వచ్చే ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో అడపాదడపా టీడీపీ - పవన్ ల మధ్య మాటల యుద్ధాలు నడుస్తున్నాయి. అయితే... చంద్రబాబు మాత్రం ఇంతవరకు పవన్ విషయంలో తగ్గుతూనే వస్తున్నారు. తమ నేతలను కూడా పవన్ పై నోరు పారేసుకోవద్దంటూ వారిస్తూ వస్తున్నారు. కానీ.. చంద్రబాబు తొలిసారిగా ఈ రోజు అసెంబ్లీ సాక్షిగా పవన్ కళ్యాణ్ కు సవాల్ విసిరారు. దీంతో ఇక ప్రత్యక్ష యుద్ధం మొదలవడం గ్యారంటీ అని తెలుస్తోంది.
    
ప్రత్యేక ప్యాకేజీకి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడం, పోలవరానికి పూర్తి నిధులు కేటాయించేందుకు కేంద్రం అంగీకరించడంతో అందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఏపీ అసెంబ్లీలో ఈ రోజు తీర్మానం పెట్టారు.  ఈ సందర్భంగా చంద్రబాబు ప్రతిపక్ష వైసిపిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  అంతేకాదు... 2014లో తమకు సహరించిన జనసేన అధినేత - పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ కు సూచనతో పాటు సవాల్ చేశారు.
    
ఏపీకి ప్రత్యేక హోదా వస్తే  ఉద్యోగాలు - నిధులు వస్తాయని వైసిపితో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా చెబుతున్నారని..  హోదాతో ఏదేదో జరుగుతుందని అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు.  హోదాతో చాలా లాభాలు కలుగుతాయనే వారికి తాను సవాల్ విసురుతున్నానని..  ఇప్పటివరకు ప్రత్యేక హోదా అనుభవిస్తున్న రాష్ట్రాలకు అలా ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి.. ఎంతగా లాభపడ్డాయో చెప్పాలని సవాల్ విసిరారు.  మరి పవన్ దీనికి ఎలా స్పందిస్తారో.. చంద్రబాబుకు ఎలాంటి సమాధానం చెబుతారో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News