హిందువుల శతాబ్దాల కల సాకారం కాబోతుంది : RSS చీఫ్ మోహన్ భాగవత్ !
గత కొన్నేళ్లుగా హిందువులు ఎదురుచూస్తున్న తరుణం మరికొద్ది రోజుల్లోనే సాకారం కాబోతుంది అని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సరసంఘ చాలక్ మోహన్ భగవత్ అన్నారు. అయోధ్య లో రామ మందిర ఆలయ భూమి పూజ కార్యక్రమం చాలా అట్టహాసంగా జరిగింది. శంకుస్థాపన కార్యక్రమం ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరిగింది. ఈ అద్భుతమైన కార్యక్రమానికి ఆర్ ఎస్ ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భూమి పూజ జరిగిన తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన సభలో అయన ప్రసంగించారు.
మోహన్ భగవత్ మాట్లాడుతూ.. ఆలయ నిర్మాణం కోసం ఎంతో మంది త్యాగం చేశారని, వారంతా ప్రస్తుతం భౌతికంగా ఇక్కడకు రాలేకపోయారని తెలిపారు. ఇక్కడకు రానివారు ఉన్నారని, వారిలో అద్వానీ జీ ఇంటిలోనే ఉండాల్సి వచ్చిందన్నారు. కొంతమంది రావాలి కానీ, కరోనా వైరస్ కారణంగా ఆహ్వానించలేదన్నారు.మన దేశం వసుదైక కుటుంబం భావనను నమ్ముతోంది.. ప్రపంచం మన అతిథి.. మన దేశవాసుల ఈ స్వభావం ప్రతి సమస్యకు పరిష్కారం కనుక్కోగలుగుతుంది.. ప్రతి ఒక్కరినీ వెంట తీసుకెళ్లాలని మేము నమ్ముతున్నాం. ఈ రోజు దేశంలో మరో నవశకం ప్రారంభమైంది అని చెప్పుకొచ్చారు.
అయోధ్య లో ఆలయ నిర్మాణం కలను సాకారం చేసుకోడానికి ఆర్ ఎస్ ఎస్ సహా అనేక హిందూ సంస్థలు 30 ఏళ్లు తీవ్రంగా కృషిచేశాయన్నారు. రామమందిరం గురించి 20-30ఏళ్లు పోరాటం చేయాల్సి ఉంటుందని అప్పుడే చెప్పానని భగవత్ తెలిపారు. రామ మందిర నిర్మాణమే ఊపిరిగా చాలా మంది బతికి... శరీరం విడిచిపెట్టారని... వారందరూ సూక్ష్మ రూపంలో ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారని, మిగితా వారందరూ తమ మనస్సుతో చూస్తున్నారని ఆయన అన్నారు. దేశంలో స్వావలంబన దిశగా పనులు జరుగుతున్నాయని, కరోనా తర్వాత ప్రపంచం మొత్తం కూడా కొత్త మార్గాల కోసం వెతుకుతోందన్నారు.