ట్విట్టర్ ‌కు కేంద్ర ప్రభుత్వం నోటీసులు ...ఎందుకంటే!

Update: 2021-02-03 13:10 GMT
రైతు మారణహోమం పేరుతో అనేక అకౌంట్ల నుంచి పోస్టులు రావడాన్ని సీరియస్‌గా తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. ఇందుకు సంబంధించి ట్విట్టర్‌కు నోటీసులు జారీ చేసింది. గతంలో ఈ రకమైన అకౌంట్లను బ్లాక్ చేయాలని కేంద్ర ఐటీ శాఖ ట్విట్టర్‌కు తెలిపింది.ట్విట్టర్‌ ఖాతాల నిలుపుదలపై ఆదేశాలు పాటించకపోవడంపై వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసింది. తొలుత రైతుల ఆందోళనల నేపథ్యంలో కొన్ని ఖాతాలు నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం ట్విట్టర్కు సూచించింది.  

అయితే, #ModiPlanningFarmerGenocide Hashtag అనే హ్యాష్‌ ట్యాగ్ ‌ను సోమవారం రాత్రి నుంచి ట్విట్టర్ మళ్లీ అనుమతి ఇచ్చింది. దీంతో ట్విట్టర్ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ప్రభుత్వం, తమ ఆదేశాలను పాటించాలని లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చింది. ఈ రకమైన హ్యాష్‌ట్యాగ్ ద్వారా చేస్తున్న పోస్టులు విద్వేషంతో పాటు సమాజంలో అశాంతిని పెంచుతాయని ప్రభుత్వం పేర్కొంది.

మారణహోమం అనేది భావస్వేచ్ఛ కాదని, అది శాంతి భద్రతలకు ఓ ముప్పు అని తెలిపింది.  క్రమంలో ప్రభుత్వ ఆదేశాలతో పలు ఖాతాలను ట్విట్టర్‌ అధికారులు నిలిపివేశారు. అయితే కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండానే నిలిపివేసిన ఖాతాలను పునరుద్ధరించింది సామాజిక దిగ్గజం. దీన్ని కేంద్రం తీవ్రంగా పరిగణించి, నోటీసులు జారీ చేసింది.

గణతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో రైతుల పరేడ్ సందర్భంగా చోటు చేసుకున్న హింసాత్మక ఘటనల తరువాత ఈ కొందరు ట్విట్టర్‌లో ఈ హ్యాష్ ట్యాగ్‌ను క్రియేట్ చేశారు. తన నోటీసులో అరడజనకు పైగా సుప్రీంకోర్టు తీర్పులను ప్రస్తావించింది. ఈ అంశంలో ట్వీట్టర్ వ్యవహరిస్తున్న తీరు సరిగ్గా లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఐటీ మంత్రిత్వశాఖ ఆదేశాల అనంతరం సుమారు 100 ట్విట్టర్ అకౌంటర్లు, 150 ట్వీట్లను సోమవారం ఉదయం ట్వీట్టర్ తొలిగించింది.
Tags:    

Similar News