విద్యార్థులకు కేంద్ర సాయమా!.. అదంతా ఉత్తదే!

Update: 2020-09-23 09:10 GMT
కరోనా లాక్ ​న్​తో అన్ని రంగాలు కుదేలయ్యాయి. ఈ నేపథ్యంలో కేంద్రప్రభుత్వం పేదప్రజలను ఆదుకుంటుందని, కొన్నివర్గాలవారికి అకౌంట్లలో డబ్బులు వేస్తున్నదని ఈ మధ్య కొన్నివెబ్​సైట్లలో వార్తలు వస్తున్నాయి. వాట్సాప్​, ఫేస్​బుక్​ వంటి సోషల్​ మీడియాలో ఇటువంటి వార్తలు వైరల్​గా మారాయి. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం పేద విద్యార్థులకు రూ.11 వేలు ఆర్థిక సాయం చేస్తున్నదని.. స్కూల్​, కాలేజీకి వెళ్లే విద్యార్థులు ఈ స్కాలర్ ​షిప్ ​కు దరఖాస్తు చేసుకోవాలని ఆ వార్త సారాంశం. ఈ వార్త కొద్ది రోజుల్లోనే కొన్ని లక్షలమంది విద్యార్థులకు చేరి పోయింది.

అయితే ఈ వార్త పై కేంద్ర సమాచార పౌరసంబంధాల శాఖ స్పందించింది.  సమాచారశాఖ అధికారిక ట్విట్టర్​ అకౌంట్​ ద్వారా ఓ ప్రకటన విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం విద్యార్థులకు ఎటువంటి ఆర్థికసాయం అందించడం లేదని.. ఓ సైట్​ లో వచ్చిన ఆ వార్త పూర్తిగా అవాస్తవమని పేర్కొన్నది. సదరు వార్తను ప్రస్తుతం ఫేస్ ​బుక్​ నుంచి తొలగించారు. అయితే విద్యార్థులు తప్పుడు వార్తలు నమ్మొద్దని.. వాటిని వైరల్​ చేయొద్దని కేంద్ర సమాచారశాఖ సూచించింది. ఏదైనా అధికారిక సమాచారం ఉంటే తామే తెలియజేస్తామని అటువంటి వరకు తప్పుడు వార్తలు నమ్మొద్దని పేర్కొన్నది. తప్పుడు వార్తలను అరికట్టేందుకు 2019 డిసెంబర్​ లో ఫ్యాక్ట్ చెక్​ ఆర్మ్​ ను ప్రారంభించింది. వివిధ సోషల్​ మీడియాల్లో సర్క్యులేట్​ అవుతున్న వార్తలు నిజమో కాదా అని  దీని ద్వారా తెలుసుకోవచ్చు.  ఈ మధ్య సోషల్ ​మీడియా లో తప్పుడు వార్తలు ప్రచారం కావడం కామన్​ గా మారిపోయింది. కొందరు ఉన్నత విద్యావంతులు కూడా నిజా నిజాలు తెలుసుకోకుండా ఇటువంటి ఫేక్​ న్యూస్ ​ను ఫేస్​ బుక్​ లో ప్రచారం చేస్తున్నారు.
Tags:    

Similar News