షర్మిలపై కేసు..కేసీఆర్ ఎత్తివేయడానికి అదే అడ్డు

Update: 2021-03-27 04:55 GMT
వైఎస్ షర్మిల ఓ కేసులో ఇరుక్కున్నారు. షర్మిలనే కాదు..  సీఎం జగన్ తల్లి విజయమ్మ కూడా ఈ కేసులో బుక్కయ్యారు. వారిద్దరూ మార్చి 31న తెలంగాణలో కోర్టుకు విచారణకు హాజరు కావాల్సి ఉంది. నేతలపై కేసులు ఫాస్ట్ ట్రాక్ కోర్టులలో విచారణ జరుగుతుండడంతో ఈ కేసు వారికి శరాఘాతంగా మారిందట..  అయితే ఏపీ సీఎం జగన్ ఫ్యామిలీతో సఖ్యతతో ఉంటున్న కేసీఆర్ ఈ కేసును వెనక్కి తీసుకోవడానికి.. ఎత్తివేయడానికి రెడీ అయినా ఒక్కరి వల్ల అది జాప్యం అవుతున్నట్టు తెలుస్తోంది.

తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమానికి వ్యతిరేకంగా నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ తరుఫున మాట్లాడి పరకాలలో పోటీకి దిగారు కొండా సురేఖ దంపతులు. వారిపై టీఆర్ఎస్ తరుఫున భిక్షపతి బరిలో నిలిచారు.  ఈ ఎన్నికల్లో ఓడిపోతే తెలంగాణ వాదమే లేదని కొండా సురేఖ సవాల్ చేశారు. దీంతో టీఆర్ఎస్ ధీటుగా పోరాడింది.

నాడు ప్రచారానికి కొండా సురేఖ తరుఫున వచ్చిన వైఎస్ షర్మిల, విజయమ్మలపై రాళ్ల దాడి కూడా జరిగింది. అనుమతి లేకుండా వాళ్లు రావడంతో కేసులు నమోదయ్యాయి.

అదే కేసులో ఇప్పుడు షర్మిల, విజయమ్మలు కేసు విచారణకు హాజరవుతున్నారు. ఓసారి వ్యక్తిగతంగా హాజరయ్యారు. మార్చి 31న వీరిద్దరూ తప్పనిసరిగా హాజరుకావాలని కోర్టు ఆదేశించింది.

ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వంపై ఏపీ సర్కార్ నుంచి ఒత్తిడి వస్తోందట.. షర్మిల, విజయమ్మలపై కేసులు ఎత్తివేయాలని కేసీఆర్ సర్కార్ భావిస్తోందట.. అయితే ఇదే కేసులో షర్మిల, విజయమ్మే కాదు.. కొండా సురేఖ, కొండా మురళి నిందితులుగా ఉన్నారు. దీంతో వారిని సేవ్ చేయడం ఇష్టం లేని కేసీఆర్ సర్కార్ ఇందులో జాప్యం చేస్తోందట.. అలా కొండా దంపతులపై కోపానికి పాపం షర్మిల, విజయమ్మలు ఈ కేసులో ఇరుక్కుపోతున్నారట..

సుప్రీం తీర్పుతో నేతలపై విచారణ వేగవంతం కావడం.. కేసీఆర్ సర్కార్ వెనక్కి తీసుకోవడంలో మీనమేషాలు లెక్కిస్తుండడంతో షర్మిల , విజయమ్మల్లో టెన్షన్ నెలకొందట..
Tags:    

Similar News