గ్రీన్ కార్డు పరిమితి ఎత్తేసేవరకు భారతీయులకు హెచ్1బీ వీసాల జారీ రద్దు
అమెరికా అధ్యక్షుడిగా జోబైడెన్ గద్దెనెక్కగానే ఇమ్మిగ్రేషన్ విధానంలో కీలక మార్పులు చేశారు. గ్రీన్ కార్డు పరిమితి విధించడం వల్ల చాలా మంది దశాబ్ధాల తరబడి వేచిచూడాల్సిన పరిస్థితులు అమెరికాలో ఉన్నాయి. కొత్తగా మళ్లీ హెచ్1బీ వీసాలిస్తే ఆ జాబితాలో వేలాదిమంది చేరిపోతారని తాజాగా 'ఇమ్మిగ్రేషన్ వాయిస్' అనే సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది.
మార్చి 9 నుంచి ఆణ్ లైన్ లోనూ వీసా దరఖాస్తు ప్రారంభం కానున్న నేపథ్యంలో సంస్థ ఈ విధంగా స్పందించింది.అమెరికాలో శాశ్వత నివాసానికి/ గ్రీన్ కార్డుల జారీకి ఉన్న పరిమితి తొలగించేవరకు.. భారత్ లో పుట్టిన వారికి హెచ్1బీ వర్క్ వీసాలు మంజూరు చేయకూడదని జోబైడెన్ ప్రభుత్వాన్ని 'ఇమ్మిగ్రేషన్' వాయిస్ అనే సంస్థ కోరింది.
ఈ సంస్థ భారతీయ-అమెరికన్లకు ప్రాతినిధ్యం వహిస్తుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న పరిమితి ప్రకారం గ్రీన్ కార్డుల కోసం ఎంతో మంది ఇండియన్ ఐటీ నిపుణులు దశాబ్ధాలుగా ఎదురుచూస్తున్నట్టు 'ఇమ్మిగ్రేషన్ వాయిస్' పేర్కొంది. వీరికి ఇచ్చాక కొత్త వారికి ప్రాధాన్యత ఇవ్వాలని సంస్థ సూచించింది.విదేశీ నిపుణులకు వీసాల జారీపై మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన నిషేధాన్ని ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ ఎత్తివేశారు. ఈ నేపథ్యంలో భారతీయ అమెరికన్ కమ్యూనిటీ కీలక సూచన చేసింది.