రూ.10 వేల జీతం ఇవ్వలేదని పగ.. రూ.24 కోట్ల టెక్స్‌టైల్ ఫ్యాక్టరీని తగలబెట్టాడు..

మాజీ యజమానితో ఉన్న స్వల్ప జీతం వివాదం తీవ్ర విధ్వంసానికి దారితీసిన ఘటన గుజరాత్‌లోని సూరత్‌లో కలకలం రేపింది.

Update: 2026-09-23 03:41 GMT

మాజీ యజమానితో ఉన్న స్వల్ప జీతం వివాదం తీవ్ర విధ్వంసానికి దారితీసిన ఘటన గుజరాత్‌లోని సూరత్‌లో కలకలం రేపింది. తనకు రావాల్సిన కేవలం రూ.10 వేల బకాయి జీతాన్ని ఇవ్వకపోవడమే కాకుండా.. ఉద్యోగం నుంచి తొలగించారనే కోపంతో ఒక అకౌంటెంట్ ఏకంగా రూ.24 కోట్ల విలువైన టెక్స్‌టైల్ వ్యాపార సముదాయాన్ని తగలబెట్టాడు. ఈ షాకింగ్ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

కేవలం రూ.10 వేల పెండింగ్ జీతం విషయంలో జరిగిన వివాదం తీవ్ర రూపం దాల్చింది. మాజీ యజమాని తనకు ఇవ్వాల్సిన డబ్బు చెల్లించలేదన్న కోపంతో ఓ అకౌంటెంట్ ఏకంగా దుకాణాలకు నిప్పుపెట్టిన ఘటన గుజరాత్‌లోని సూరత్‌లో సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో సుమారు రూ.24 కోట్ల విలువైన వస్తువులు దగ్ధమైనట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

నివేదికల ప్రకారం.. వినోద్ సాల్వే అనే వ్యక్తి గతంలో ఓ టెక్స్‌టైల్ మార్కెట్‌లో అకౌంటెంట్‌గా పనిచేసినట్లు తెలుస్తోంది. తనకు రావాల్సిన సుమారు రూ.10 వేల జీతం విషయంలో మాజీ యజమానితో అతడికి వివాదం ఏర్పడినట్లు సమాచారం. పలుమార్లు డబ్బులు అడిగినా తనకు చెల్లించలేదన్న ఆగ్రహంతో అతడు తీవ్ర చర్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

సీసీటీవీ ఫుటేజీలో నిందితుడు మార్కెట్‌లోని పలు ప్రాంతాల్లో సంచరిస్తూ వస్తువులను ధ్వంసం చేస్తున్న దృశ్యాలు కనిపించినట్లు నివేదికలు చెబుతున్నాయి. పెట్రోల్‌ను ఉపయోగించి దుకాణాల్లోని వస్తువులకు నిప్పంటించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనలో 14కు పైగా దుకాణాలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు సమాచారం. భారీగా టెక్స్‌టైల్ సామగ్రి, ఇతర విలువైన వస్తువులు కాలిపోయినట్లు తెలుస్తోంది.

ఈ ఘటనతో మార్కెట్‌లో ఒక్కసారిగా భయాందోళన నెలకొంది. మంటలు వేగంగా వ్యాపించడంతో భారీ ఆస్తి నష్టం సంభవించినట్లు అధికారులు తెలిపారు. మొత్తం నష్టం సుమారు రూ.24 కోట్ల వరకు ఉండొచ్చని ప్రాథమిక అంచనాలు వెలువడ్డాయి. అయితే నష్టానికి సంబంధించిన తుది లెక్కలు ఇంకా పూర్తిగా నిర్ధారించాల్సి ఉంది.

కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి వినోద్ సాల్వేను అరెస్ట్ చేసినట్లు సమాచారం. జీతానికి సంబంధించిన వివాదం ఎలా ఇంత భారీ విధ్వంసానికి దారితీసిందన్న కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

ఒక చిన్న మొత్తానికి సంబంధించిన వివాదం చివరకు కోట్ల రూపాయల ఆస్తి నష్టానికి దారితీయడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడయ్యే అవకాశం ఉంది.






Tags:    

Similar News