రోశయ్య పేరుతో బాబుకు బుగ్గన పంచ్ మామూలుగా లేదుగా

Update: 2019-12-10 13:27 GMT
రాజకీయ నాయకులకు సమయస్ఫూర్తి చాలా ముఖ్యం. టైమ్లీగా వేస పంచ్ లు ఒక్కోసారి ఎంతలా పేలతాయంటే.. కొన్ని రోజుల పాటు టార్గెట్ అయిన వారు తలెత్తుకోలేని పరిస్థితి ఉంటే.. టార్గెట్ చేసిన వారి ఇమేజ్ అమాంతం పెరిగిపోతుంది. ఇప్పుడు ఏపీ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పరిస్థితి కూడా ఇలానే ఉంది. కూల్ గా ఉన్నట్లు ఉంటూనే ఆయన వేసే పంచ్ లు పదునైన బాణాల్ని తలపిస్తుంటాయి.

తాజాగా బాబును ఉద్దేశించి ఆయన వేసిన పంచ్ కు దిమ్మ తిరిగే షాక్ తగలమే కాదు.. ఆయన నోట మాట రాకుండా చేసిందని చెప్పాలి. తనను ప్రతిపక్ష నేత చంద్రబాబు పదే పదే తెలివైన వ్యక్తి అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేస్తున్న వేళ.. ఆయనకు పంచ్ లాంటి వ్యాఖ్య ఒకటి చేశారు. మాజీ ముఖ్యమంత్రి రోశయ్యను కూడా గతంలో చంద్రబాబు తనను అన్నట్లే తెలివైన వారు అనే వారన్నారు.

దానికి అప్పట్లో రోశయ్య ఏమని బదులిచ్చారో చెబుతూ.. తనకు తెలివి ఎక్కువగా ఉంటే గుమస్తాలా పని చేయనని.. తనను నమ్మిన ముఖ్యమంత్రులను వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రిని అయ్యేవాడినని అన్నారంటూ తనను మరోసారి చంద్రబాబు తెలివైనవారన్న మాట అనకుండా బుగ్గన భారీ పంచ్ ఇచ్చారు.


Tags:    

Similar News