బుద్దుడిని అవమానపరిస్తే ఊరుకుంటారా..?

Update: 2016-10-22 07:50 GMT
తెలియకచేశాడని అనుకోలేం - అలా అని తెలిసి చేస్తే క్షమించలేం అంటూ... పోర్చుగల్ ఫుట్ బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో పై నెటిజన్లు ఆగ్రహానికి గురయ్యారు. ఇతడు చేసిన పనికి ఆన్ లైన్ వేదికగా ఏకిపారేస్తున్నారు. ఇంతకూ ఇతడు చేసిన పనేంటి అంటారా... గౌతమ బుద్దుడిని అవమానించడం. కులమతాలకు అతీతంగా గౌతమ బుద్దుడిని ప్రపంచం మొత్తం గౌరవిస్తుంది... అలాంటి గౌతముడిపై క్రిస్టియానో ప్రవర్తించిన తీరే ఈ ఆగ్రహానికి కారణం.

వివరాళ్లోకి వస్తే... పోర్చుగల్ పుట్‌ బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో గౌతమ బుద్ధుడి విగ్రహం ముందు కాలు పెట్టి నిల్చోని ఫోటో దిగాడు. అనంతరం ఆ ఫోటోను ఇన్‌ స్టాగ్రామ్‌‌ లో పోస్ట్ చేశాడు. దీంతో ఆ ఫోటోను చూసిన నెటిజన్లు క్రిస్టియానో పై మండిపడుతున్నారు. "నువ్వు ఎంత గొప్ప ఆటగాడివైనా కావొచ్చు కానీ... బుద్దుడి విషయంలో నీ ప్రవర్థన సమర్ధనీయం కాదు" అంటూ దుయ్యబడుతున్నారు.

ఇలా గౌతమ బుద్ధుడి విగ్రహంపై కాలుపెట్టి క్రిస్టియానో తన అహంకారాన్ని చాటుకున్నాడని బుద్ధిస్టులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో తక్షణం క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఆన్ లైన్ లో స్పందించిన ఆయన అభిమానులు... "క్రిస్టియానో... నేను నీ అభిమానికి, నువ్వు బుద్దుడి విషయంలో ప్రవర్తించిన తీరు ముద్దిస్టుల మనసులను గాయపరిచింది, నువ్వు క్రీస్టియన్ వా - ముస్లిం వా - హిందువా ఆనే విషయం పక్కనపెడితే... నీకు అన్ని మతాలకు చెందినవారూ అభిమానులుగా ఉన్నారు... ఒక అభిమానిగా నేనైతే నిన్ను క్షమిస్తాను కానీ నీ పని వల్ల ఎంతోమంది మనసులు గాయపడ్డాయి" అని పోస్ట్ చేశాడు.

ఇదే క్రమంలో... "నీ చర్యతో ఒక అభిమానిని కోల్పోయావు" అంటూ మరో అభిమాని పేర్కొన్నాడు. కాగా, ఈ ఫోటోను ఇన్‌ స్టాగ్రామ్‌‌ లో పోస్ట్ చేసిన 9 గంటల్లోనే 1.9 మిలియన్ల లైకులు రాగా, సుమారు 9,40,381 మంది కామెంట్స్ రూపంలో స్పందించారు. వీరిలో సుమారు 50000 మంది రొనాల్డో పై తీవ్రంగా మండిపడ్డారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News