స్మార్ట్ ఫోన్ల గేమ్ ఛేంజర్.. ఎంత పెద్ద బ్యాటరీ అంటే?

ఇందుకు భిన్నంగా రియల్ మీ తాజాగా లాంఛ్ చేసే కొత్త స్మార్ట్ ఫోన్ బ్యాటరీ సామర్థ్యం అక్షరాల 10వేల ఎంఏహెచ్ కావటం గమనార్హం.;

Update: 2026-01-21 08:30 GMT

స్మార్ట్ ఫోన్ మార్కెట్ ను పూర్తిస్థాయిలో ప్రభావితం చేసే ఒక కొత్త ఆవిష్కరణతో ఎంట్రీ సరికొత్తగా ఇస్తోంది రియల్ మీ. స్మార్ట్ ఫోన్లు.. ఇంటర్నెట్ వాడకంతో పాటు.. యూట్యూబ్.. పలు సోషల్ మీడియా ప్లాట్ ఫాం పుణ్యమా అని.. అదే పనిగా ఫోన్లను వాడేయటం.. రోజుకు ఏడెనిమిది గంటలు ఫోన్లతోనే ఎంగేజ్ కావటం ఇప్పుడో అలవాటుగా మారింది. అయితే.. దీనికి ఉన్న ఒకే ఒక్క ఇబ్బంది.. బ్యాటరీ బ్యాకప. ఈ ఇబ్బందిని అధిగమించేందుకు పలువురు పవర్ బ్యాంక్ లను వినియోగించటం తెలిసిందే.

ఇకపై.. అలాంటి అవసరం లేకుండా.. ఎవరూ అంచనా వేయలేనంత భారీ బ్యాటరీ బ్యాకప్ తో తన సరికొత్త ఫోన్ ను లాంఛ్ చేస్తోంది చైనాకు చెందిన రియల్ మీ. గడిచిన కొన్నేళ్లుగా తన మార్కెట్ వాటాను పెంచుకుంటూ పోతున్న ఈ సంస్థ.. తాజాగా స్మార్ట్ ఫోన్లలో గేమ్ ఛేంజర్ గా తన కొత్త స్మార్ట్ ఫోన్ ను ఈ నెలలో తీసుకురానుంది. ఇప్పటివరకుస్మార్ట్ ఫోన్లకు అత్యధిక బ్యాటరీ సామర్థ్యం అంటే 6500-7300 ఎంఏహెచ్ తో కొన్ని ఫోన్లు ఉన్నాయి.

ఇందుకు భిన్నంగా రియల్ మీ తాజాగా లాంఛ్ చేసే కొత్త స్మార్ట్ ఫోన్ బ్యాటరీ సామర్థ్యం అక్షరాల 10వేల ఎంఏహెచ్ కావటం గమనార్హం. సాధారణంగా ఇప్పుడున్న స్మార్ట్ ఫోన్లు దాదాపు 5000 ఎంఏహెచ్ తో ఉంటాయి. ఈ లెక్కన చూస్తే.. డబుల్ సామర్థ్యంతో రియల్ మీ తన కొత్త ఫోన్ ను తెస్తుందని చెప్పాలి. ఈ నెల (జనవరి) 29 మధ్యాహ్నం 12 గంటల వేళలో రియల్ మీ తన పీ4 పవర్ ను లాంఛ్ చేయనుంది. ఇందులో తొలిసారి 10,001 ఎంఏహెచ్ బ్యాటరీ అందిస్తున్నట్లుగా కంపెనీ ప్రకటన చేయటంతో ఇప్పుడు అందరి చూపు ఈ ఫోన్ మీద పడింది.

సాంకేతికంగా చూస్తే.. 144హెచ్ జెడ్ రిఫ్రెష్ రేటుతో కూడిన 1.5కె రిజల్యూషన్ డిస్ ప్లేతో ఈ ఫోన్ ను తీసుకురానున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు బయటకు వెల్లడి కావాల్సి ఉంది. ఇంతకూ ఈ ఫోన్ ధర ఎంత ఉంటుందన్న ప్రశ్నకు మార్కెట్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం రూ.35 వేలకు పైనే ఉంటుందని చెబుతున్నారు. బిగ్ బ్యాటరీతో వస్తున్న ఈ ఫోన్ స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో గేమ్ ఛేంజర గా అభివర్ణిస్తున్నారని చెప్పాలి. దీనికి మార్కెట్ నుంచి సానుకూల స్పందన లభిస్తే.. రానున్న రోజుల్లో స్మార్ట్ ఫోన్లు మొత్తం 10వేల ఎంఏహెచ్ బ్యాటరీ పవర్ ఉండేలా మారతాయని చెప్పకతప్పదు.

Tags:    

Similar News