ఏపీలో మరీ ఇంత దారుణమా? నలుగురు మహిళలపై గొడ్డలితో దాడి
గొడవలు ఎన్నైనా ఉండొచ్చు. వివాదాలను పరిష్కరించుకోవటానికి చట్టాలు.. కోర్టులు.. పోలీస స్టేషన్లు ఇలా చాలానే ఉన్నాయి.;
గొడవలు ఎన్నైనా ఉండొచ్చు. వివాదాలను పరిష్కరించుకోవటానికి చట్టాలు.. కోర్టులు.. పోలీస స్టేషన్లు ఇలా చాలానే ఉన్నాయి. వాటిని వదిలేసి.. చేతికి చిక్కిన గొడ్డలితో దాడి చేసుకుంటూ పోయిన వైనాన్ని పలువురు తప్పు పడుతున్నారు. ఎంత ఆస్తుల పంచాయితీ ఉంటే మాత్రం ఈ స్థాయిలో విరుచుకుపటం చూస్తే.. ఏపీలో ఇంతటి అరాచకమేంది? అన్న భావన కలుగకమానదు. అసలేం జరిగిందంటే..
ఏలూరు జిల్లా జంగారెడ్డి గూడెంలోని రెండు కుటుంబాల మధ్య ఆస్తి తగదాతో పాటు.. పొలం సరిహద్దుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో.. దీనికి సంబంధించిన పంచాయితీ తాజాగా మరింత వివాదాస్పదంగా మారింది. ఈ నేపథ్యంలో వివేక్ అనే వ్యక్తి ఏకంగా నలుగురు మహిళలపై గొడ్డలితో దాడి చేశాడు.
ఎలాంటి కనికరం లేకుండా.. చట్టం పట్ల భయం భక్తి అన్నది లేకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ.. ఇంత బరితెగింపు ఏంటి? అన్నది చర్చగా మారింది. పొలం సరిహద్దుల మధ్య నెలకొన్న ఘర్షణల నేపథ్యంలో తీవ్ర ఆగ్రహంతో ఉన్న ముప్పిడి వివేక్ గొడ్డలి పట్టుకొని.. తనకు గొడవ ఉన్న నలుగురు మహిళలపై దాడికి పాల్పడ్డాడు. ఈ ఉదంతంలో 47 ఏళ్ల జీలుగులమ్మ ఘటనా స్థలంలోనే మరణించగా.. చుక్కమ్మ.. ఉషారాణి.. ధనలక్ష్మిలకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని జంగారెడ్డి గూడెం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. స్థానికంగా ఈ ఉదంతం పెను సంచలనంగా మారింది.