జగనన్న సైన్యం రంగంలోకి !

వైసీపీ ఒక కొత్త పంథాను ఎంచుకుంది. ఆ పార్టీ పుట్టి ఈ నెల 12 నాటికి 15 ఏళ్ళు పూర్తి అయి 16వ ఏటకు అడుగు పెడుతుంది.;

Update: 2026-03-09 17:11 GMT

వైసీపీ ఒక కొత్త పంథాను ఎంచుకుంది. ఆ పార్టీ పుట్టి ఈ నెల 12 నాటికి 15 ఏళ్ళు పూర్తి అయి 16వ ఏటకు అడుగు పెడుతుంది. అంటే యుక్త వయసులోకి వచ్చింది అన్న మాట. మరి ఈ కీలక దశలో వైసీపీ పార్టీ పరంగా సంస్థాగతంగా ఏమి చేయాలనుకుంటోంది అన్నది కీలకమైన అంశం. వైసీపీకి పార్టీ పుట్టాక ఎన్నడూ తెలియని ఎరగని ఘోర పరాభవం సంభవించింది. కేవలం 11 సీట్లకు వైసీపీ పరిమితం అయింది. దాంతో అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా దక్కని ఇబ్బందికరమైన వాతావరణంలో వైసీపీ ఉంది.

సరికొత్త ప్రయోగంతో :

ఇక వైసీపీ ఓటమి చెందాక 21 నెలలు గడచాయి. ఈ కాలంలో వైసీపీ అధినేత జగన్ కూడా తక్కువ సార్లే జనంలోకి వచ్చారు వైసీపీ పరంగా చేపట్టిన కార్యక్రమాలు అన్నీ పార్టీ నేతలతోనే చేయిస్తూ వచ్చారు. జిల్లాల పర్యటనలు కూడా జగన్ చేస్తారు అని ప్రచారం సాగినా అది కూడా ఆచరణలో అమలు కాలేదు. మరి ఈ కీలక సమయంలో వైసీపీ ఏమి చేస్తోంది అంటే ఒక కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది అని అంటున్నారు. దాని వల్ల వైసీపీలో కార్యకర్తలంతా నాయకులే అన్న సందేశాన్ని ఇస్తోంది అని అంటున్నారు. అంతే కాదు బాధ్యతలను కూడా వారు తీసుకుంటూ ముందుకు సాగుతారని చెబుతోంది.

భారీ సైన్యంగా :

ఇప్పటిదాకా దేశంలో ఏ రాజకీయ పార్టీ అయినా సంస్థాగతంగా పటిష్టం అంటే సభ్యత్వ నమోదుకే అధిక ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నాయి. వైసీపీ మాత్రం దాని కంటే మరో అడుగు ముందుకేసి సభ్యత్వం కాదు బాధ్యతలే ఇస్తోంది. పార్టీలో అతి ముఖ్య స్థానంలో ప్రతీ కార్యకర్తను నిలబెడుతోంది. ఫలితంగా వారంతా కేవలం పార్టీ సభ్యుడు అని స్టాంప్ వేయించుకుని మూలన ఉండకుండా పార్టీ పదవితో క్రియాశీలకంగా ఉంటారని ఆలోచిస్తోంది. అలాగే వారికి పార్టీ పదవులతో ప్రాముఖ్యత ఇస్తోంది అన్న సంతృప్తి ఉంటుందని అలా జెండా పట్టిన ప్రతీ వారికీఎ పార్టీలో మంచి గుర్తింపు ఉండడమే కాకుండా పార్టీకి కూడా వారు సరికొత్త ఆయుధంగా మారుతారు అని భావిస్తోంది. అలా ఒక భారీ సైన్యంగా వారిని తయారు చేసే పనిలో వైసీపీ ఇపుడు బిజీగా ఉంది అని అంటున్నారు.

ఉగాది నాటికి అంతా :

వైసీపీకి రాష్ట్ర స్థాయిలో కమిటీలు ఉన్నాయి. జిల్లాలు, నియోజకవర్గలలో కూడా కమిటీలు ఉన్నాయి. వాటిని మండల గ్రామ స్థాయిలో బూత్ లెవెల్ దాకా విస్తరిస్తోంది. అంతే కాదు ప్రతీ చోటా పార్టీ ప్రధాన కమిటీతో పాటు ఏడు అనుబంధ కమిటీలను కూడా ఏర్పాటు చేస్తోంది. మహిళ, యువత, విద్యార్ధి, టీచర్స్, రైతు, కార్మిక, సోషల్ మీడియా వంటి అనుబంధ కమిటీలను ఏర్పాటు చేయనుంది అని అంటున్నారు. దీంతో వైసీపీ బలం అపారంగా గ్రామాలలో పెరుగుతుంది అని అంటున్నారు.

గ్రౌండ్ లెవెల్ లో గట్టిగా :

ఇక క్షేత్ర స్థాయిలో పటిష్టంగా ఉండాలని వైసీపీ భావిస్తోంది. పార్టీ హైకమాండ్ తో నేరుజ్గా గ్రామ స్థాయి కమిటీలను అనుసంధానం చేయడం ద్వారా ఒక పిలుపు ఇస్తే చాలు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన ఎక్కడికక్కడ రీ సౌండ్ చేసేలా ఉండేలా చూస్తున్నారు. ఇక ప్రతీ నియోజకవర్గంలో కనీసంగా 12 వేల మంది దాకా వైసీపీ సైన్యం ఈ లెక్కన ఉంటుందని అదే మొత్తం 175 అసెంబ్లీ నియోజ్కవార్గాలకు వచ్చేసరికి ఏకంగా 18 లక్షల దాకా భారీ సైన్యం ఉండేలా చేసుకుంటే కంటిన్యూస్ గా ప్రభుత్వం మీద ప్రజా పోరాటాలు చేయడానికి వీలు అవుతుందని అంచనా వేస్తున్నారు. అంతే కాదు ప్రతీ నియోజకవర్గంలో ఒక కీలకమైన ఓటు బ్యాంక్ గా ఒపీనియన్ కలెక్ట్ చేస్తూ జనాలని మోటివేట్ చేసే బలమైన శక్తిగా ఈ కమిటీలు ఉంటాయని అంటున్నారు. మొత్తానికి ఉగాది తరువాత జగనన్న సైన్యం రంగంలోకి దిగబోతోంది అని ప్రచారం సాగుతోంది.

Tags:    

Similar News