భార‌త్‌ను వ‌ణికిస్తున్న 'నెట్‌' స‌ర్వీస్‌.. ఏం జ‌రిగింది?

ఇదిలావుంటే.. చ‌మురు, గ్యాస్ కంటే కూడా.. ఇప్పుడు ఇంట‌ర్నెట్ వ్య‌వ‌హారం.. ప్ర‌పంచాన్ని ముఖ్యంగా భార‌త్‌ను కుదిపివేస్తోంది.;

Update: 2026-03-09 15:30 GMT

ప‌శ్చిమాసియాలో నెల‌కొన్న యుద్ధం ప‌రిస్థితులు.. ఇత‌ర దేశాల‌పై ప్ర‌భావం చూపించ‌డం ప్రారంభ‌మైంది. ఇరాన్ అధీనంలో ఉన్న ప్ర‌పంచ నౌకా మార్గం.. హోర్ముజ్ జ‌ల‌సంధిలో నెల‌కొన్న సంక్షోభం కార‌ణం.. ఇప్ప‌టికే పెట్రోలు, గ్యాసుల‌పై ప్ర‌భావం చూపుతోంది. భార‌త్ వంటి అతి పెద్ద జ‌నాభా ఉన్న దేశాల‌కు ఇది శ‌రాఘాతంగా మార‌నుంది. ప్ర‌స్తుతం 60 రోజుల‌ వ‌ర‌కు అవ‌స‌ర‌మైన చ‌మురు నిల్వ‌లు ఉన్నాయ‌ని దేశంప్ర‌క‌టించింది. ఇక‌, ఇత‌ర దేశాల్లో ప‌రిస్థితి ఆందోళ‌న క‌రంగానే ఉంది. ఇదిలావుంటే.. చ‌మురు, గ్యాస్ కంటే కూడా.. ఇప్పుడు ఇంట‌ర్నెట్ వ్య‌వ‌హారం.. ప్ర‌పంచాన్ని ముఖ్యంగా భార‌త్‌ను కుదిపివేస్తోంది.

యూర‌ప్ దేశాల నుంచి భార‌త్ ఇంట‌ర్నెట్ సేవ‌ల‌ను పొందుతోంది. ముఖ్యంగా ఇంట‌ర్నెట్ ట్రాఫిక్ అంతా గ‌ల్ఫ్ ప్రాంతంలోనే ఉంది. స‌ముద్ర గ‌ర్భంలోనే కొన్ని వేల కిలో మీట‌ర్ల మేర‌కు కేబుళ్లు ఏర్పాటయ్యాయి. ఇవి ముంబై, చెన్నై, బెంగ‌ళూరుల‌లోని ఇంట‌ర్నెట్ కేంద్రాల‌ను ప‌శ్చిమాసియాతో అనుసంధంగా ఉన్న యూర‌ప్ దేశాల‌కు లింక్ అయ్యాయి. ఈ కేబుళ్లు అన్నీ కూడా.. ప‌శ్చిమాసియా స‌ముద్ర మార్గంలోనే కొన‌సాగుతున్నాయి. అయితే.. ఇప్పుడు యుద్ధం తీవ్రత పెర‌గ‌డం, స‌ముద్రంలోనూ అమెరికా త‌న ఆధిప‌త్యం ప్ర‌ద‌ర్శించ‌డం..ఇరాన్ నౌక‌ల‌ను కూల్చేయ‌డం వంటి ప‌రిణామాల‌తో స‌ముద్ర గ‌ర్భంలో ఉన్న కేబుళ్ల‌కు కూడా ప్ర‌మాదం పొంచి ఉంద‌ని నిపుణులు చెబుతున్నారు.

ప్ర‌స్తుతం సుమారు 99 శాతం అంతర్జాతీయ డేటా సముద్ర గ‌ర్భంలో ఏర్పాటు చేసిన `ఫైబర్-ఆప్టిక్ కేబుల్స్` ద్వారానే వ‌స్తోంది. ఇవే భార‌త నెట్ వ్య‌వ‌స్థ‌కు కీల‌కంగా ఉన్నాయి. ప్ర‌స్తుత యుద్ధ ప్ర‌భావంతో ఈ కేబుళ్ల‌కు ఇబ్బందులు వ‌స్తాయ‌నే భ‌యం ఉన్న విష‌యాన్ని ప‌క్క‌న పెట్టినా.. మ‌రోవైపు.. నిరంత‌రాయంంలో ఉప్పునీటిలో ఉన్న నేప‌థ్యంలో కేబుల్స్ పాడైపోతూ ఉంటాయి. స‌ముద్ర జంతువులు కూడా కేబుళ్ల‌కు ఇబ్బందులు క‌లిస్తుంటాయి. దీంతో ఎప్ప‌టిక‌ప్పుడు వాటికి మరమ్మతులు, నిర్వహణ కీల‌కం. ప్ర‌స్తుతం నెల‌కొన్న ప‌రిస్థితుల్లో మ‌ర‌మ్మ‌తులు చేయ‌లేని ప‌రిస్థితి ఏర్ప‌డింది.

ఇరాన్‌, అమెరికా, ఇజ్రాయెల్ ప్ర‌యోగిస్తున్న క్షిప‌ణులు, డ్రోన్ దాడుల భయం కారణంగా మరమ్మతు చేసేందుకు నౌకులు ముందుకు రావ‌డం లేదు. సిబ్బంది కూడా దీర్ఘ‌కాలిక సెల‌వుపై వెళ్లిపోయిన‌ట్టు తెలిసింది. ఈ క్ర‌మంలో ఏ క్ష‌ణంలో ఏం జ‌రిగినా.. భార‌త ఇంటర్నెట్ పై ప్ర‌భావం చూపించే అవ‌కాశం ఉంది. త‌ద్వారా.. బ‌ల‌మైన ఆర్థిక వ్య‌వ‌స్థ కుప్ప‌కూలినా ఆశ్చ‌ర్యం లేద‌ని అంటున్నారు. ప్ర‌స్తుత దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ పూర్తిగా నెట్‌పైనే ఆధాప‌డి ఉన్న విష‌యం తెలిసిందే. ఏ చిన్న లావాదేవీ చేయాల‌న్నా.. నెట్ కావాల్సిందే. సో.. యుద్ధ ప్ర‌భావం చ‌మురుకంటే కూడా ఇప్పుడు నెట్‌పైనే ఎక్కువ‌గా ఉంద‌ని నిపుణులు చెబుతున్నారు.

Tags:    

Similar News