ఫ్రెండ్ షిప్ డే: వీరంతా 'పొలిటిక‌ల్' ఫ్రెండ్స్‌!

స్నేహా నిక‌న్న మిన్న లోకాన లేదురా! అంటూ.. ప్ర‌పంచ వ్యాప్తంగా ఆదివారం(ఆగ‌స్టు 2) స్నేహితుల దినోత్స‌వాన్ని ఘ‌నంగా నిర్వ‌హించుకుంటున్నారు.

Update: 2026-08-02 08:59 GMT

స్నేహాని క‌న్న మిన్న లోకాన లేదురా! అంటూ.. ప్ర‌పంచ వ్యాప్తంగా ఆదివారం(ఆగ‌స్టు 2) స్నేహితుల దినోత్స‌వాన్ని ఘ‌నంగా నిర్వ‌హించుకుంటున్నారు. రక్త సంబంధీకుల క‌న్నా.. స్నేహితుల మ‌ధ్య స‌ఖ్య‌త ఎక్కువ‌గా పెరుగుతోంది. ఏ చిన్న క‌ష్టం వ‌చ్చినా.. ఇంట్లో శుభ‌కార్యాలు జ‌రిగినా.. మ‌న‌సు బాగోక పార్టీలు చేసుకున్నా.. ఫ్రెండ్సే ప్ర‌త్యేక అతిధులు!. తొలి ఆహ్వానం.. అగ్ర‌తాంబూలం కూడా వారికే!!. ఇది కేవ‌లం సాధార‌ణ జీవితాల్లోనే కాదు.. రాజ‌కీయ నాయ‌కుల మ‌ధ్య, పార్టీల మ‌ధ్య కూడా నేడు పెరుగు తున్న సంస్కృతి. మ‌ర‌క మంచిదే అన్న‌ట్టుగా.. స్నేహం అన్ని విధాలా మ‌న‌సుకు, వ్య‌క్తుల‌కు కూడా హాయినిస్తుంది.

ఇక‌, రాజ‌కీయంగా చూసుకున్నా.. ప్ర‌స్తుతం ఒక‌ప్ప‌టి స్నేహాల కంటే కూడా ఇప్పుడు రాజ‌కీయ స్నేహాలు పెరుగుతున్నాయి. పార్టీలు, నాయ‌కుల మ‌ధ్య అవ‌స‌రం-అధికారం అనే రెండు ప‌ట్టాల‌పై ప‌రుగులు పె డుతున్న స్నేహాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. త‌మిళ‌నాట ఎన్నిక‌ల స‌మ‌యంలో కాంగ్రెస్ డీఎంకేతో పొత్తు పెట్టుకుని 5 స్థానాల్లో విజ‌యం ద‌క్కించుకుంది. అనంత‌రం.. త‌న స్నేహాన్ని అధికారంలోకి వ‌చ్చిన టీడీపీ అధిప‌తి, ప్ర‌స్తుతం సీఎం విజ‌య్‌తొ కొన‌సాగిస్తోంది.

ఇక‌, బీజేపీ-టీడీపీ-జ‌న‌సేనల మ‌ధ్య స‌ఖ్య‌త నానాటికీ పెరుగుతోంద‌న్న సంకేతాలు ఇస్తున్నాయి. తాజాగా భోగాపురం అంత‌ర్జాతీయ విమానాశ్ర‌య ప్రారంభోత్సవం.. దీనికి కొస‌మెరుపు. ఈ వేదిక‌గా మూడు పార్టీల అగ్ర‌నేత‌లు.. కూడా త‌మ స్నేహం మ‌రింత చిగురించింద‌న్న సంకేతాలు పంపించారు. ఇది.. ఏపీలో రాబోయే ఎన్నిక‌ల వ‌రకు పార్టీల‌కు, నాయ‌కుల‌కు కూడా బూస్ట్‌గా ప‌నిచేయ‌నుంది. అంత‌ర్గ‌తంగా కూడా.. ఈ మూడు పార్టీలు.. త‌న`స్నేహాన్ని` ప‌టిష్టం చేసుకునే దిశ‌గానే అడుగులు వేస్తున్నాయి.

ఈ స్నేహం డిఫ‌రెంట్‌..

ఇక‌, రాజ‌కీయ స్నేహాల విష‌యంలో కొన్ని బ‌య‌ట‌కు స్ప‌ష్టంగా ఉంటే.. మ‌రికొన్ని అంత‌ర్గ‌త స్నేహాలు క‌నిపిస్తాయి. వీటిని కూడా త‌ప్పుబ‌ట్ట‌డానికి అవ‌స‌రం లేదు. ఎందుకంటే.. పొలిటిక‌ల్ స్నేహం అన్నా.. ప‌ర‌స్ప‌ర ప్ర‌యోజ‌నం.. ప‌ర‌స్ప‌ర అవ‌స‌రం రెండూ ఉంటాయి. వైసీపీ-బీజేపీ, బీఆర్ ఎస్‌-బీజేపీల మ‌ధ్య అంత‌ర్గ‌త స‌ఖ్య‌త ఉంద‌న్న‌ది రాజ‌కీయ వ‌ర్గాల్లో ఎప్ప‌టి నుంచో ఉన్న చ‌ర్చే!. సో.. ఎవ‌రి అవ‌స‌రం వారిది. ఇక‌, తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్‌కు ఎంఐఎంతో ఉన్న స్నేహం కూడా ఈ కోవ‌లోకే వ‌స్తుంద‌ని అంటున్నారు. పైకి క‌నిపించ‌ని ఈ `మిత్ర‌త్వం` ఆ పార్టీల ఉమ్మ‌డి ల‌క్ష్యాల‌తోపాటు.. వ్య‌క్తిగ‌త అవ‌స‌రాల ను కూడా తీర్చుతున్నాయి. మొత్తంగా.. ప్ర‌పంచ ఫ్రెండ్ షిప్ డే నాడు.. రాజ‌కీయ ఫ్రెండ్స్ కూడా శుభాకాంక్ష‌లు చెప్పుకోవ‌డం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News