ఎలుకల్లో బీపీ..కారణం అదేనన్న శాస్త్రవేత్తలు !

Update: 2020-09-04 12:10 GMT
సర్వసాధారణంగా మనుషుల్లో 45 ఏళ్లు పైబడిన వారు రక్తపోటు(బీపీ) సమస్యతో బాధపడుతూ ఉంటారు. అయితే తాజాగా శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో జంతువులు సైతం రక్తపోటు సమస్యను ఎదుర్కొంటున్నట్టు గుర్తించారు. ఎలుకలు బిపి సమస్యతో బాధపడుతున్నట్టు గుర్తించామని శాస్త్రవేత్తలు వెల్లడించారు. అయితే అన్ని ఎలుకలు బిపితో బాధపడవు అని , నిద్రలేమి సమస్యతో బాధపడుతున్న ఎలుకలు మాత్రమే బీపీతో భాద పడుతున్నట్టు తాము గుర్తించామని శాస్త్రవేత్తలు వెల్లడించారు.

ఈ పరిశోధనలో భాగంగా  కొన్ని ఎలుకలను తీసుకొని నాలుగు వారాల పాటు వాటికీ శాస్త్రవేత్తలు నిద్రాభంగం కలిగించారు. నిద్రాభంగం కలిగించిన ఎలుకల్లో బీపీని చెక్ చేయడంతో పాటు.. వాటి మలమూత్రాలను పరిశీలించారు. ఈ పరిశోధనలో సరిగా నిద్ర పోని ఎలుకలకు రక్తపోటు మొదలైందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. రక్తపోటు మొదలైన తరువాత వాటికి నిద్రాభంగం కలిగించకుండా మరికొన్ని రోజులు పరిశోధనలు కొనసాగించామని .. అయితే వాటిలో రక్తపోటు మాత్రం తగ్గలేదని తెలిపారు. మనుషులపై కూడా రక్తపోటు ఉంటే ఈ దిశగా ప్రయోగాలు చేయాల్సి ఉందని వెల్లడించారు. నిద్రలేమి సమస్యతో బాధపడే మనుషులు బిపి బారిన పడే అవకాశం ఉందని తెలిపారు. ఎవరైతే దీర్ఘకాలికంగా నిద్రలేమి సమస్యతో బాధపడుతూ ఉంటారో వారికి రక్తపోటు ముప్పు ఉండవచ్చని శాస్త్రవేత్తలు వెల్లడించారు.
Tags:    

Similar News