• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఫైట్లో పడుకొని సిగిరెట్...

ఫైట్లో పడుకొని సిగిరెట్ తాగిన అతిగాడి తాజా ఘనకార్యం.. 'ఈ రోడ్డు మా నాన్నది'

By - Tupaki Desk
Update: 2022-08-13 04:49 GMT
సోషల్ మీడియాకు పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తూ.. అప్పటివరకు సాదాసీదాగా ఉండే కొందరు అతి తక్కువ కాలంలో సెలబ్రిటీలుగా మారటం.. లక్షలాది మంది పాలోయర్లు ఉండటం లాంటివి చోటు చేసుకుంటున్నాయి.

ఇలా లక్షల్లో ఫాలోయర్లు ఉండే కొందరు బుద్దిగా.. తమ పని తాము చేసుకుంటూ పోతే.. మరికొందరు మాత్రం అందుకు భిన్నంగా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ అతి చేస్తున్న వైనం కనిపిస్తూ ఉంటుంది. ఆ కోవలోకే వస్తాడు బాడీ బిల్డర్.. ఇన్ స్టాగ్రామ్ లో లక్షలాది మంది ఫాలోయర్స్ ఉన్న బాబీ కటారియా.

అవును.. ఈ అతిగాడికి సంబంధించిన ఫోటో ఒకటి రచ్చగా మారటం.. ఫ్లైట్ లో పడుకొని సిగిరెట్ తాగి రచ్చ చేసిన ఇతను.. ఇప్పుడు మరో అతి పని చేశాడు.విమానం సీట్లో పడుకొని సిగిరెట్ కాల్చిన ఉదంతానికి సంబంధించి అతడిపై కేసు నమోదు కావటం.. అతగాడి తీరుపై కేంద్ర విమానయాన రంగ అధికారులు సీరియస్ గా ఉండటం తెలిసిందే.

ఇదిలా ఉండగా.. తాజాగా ఉత్తరాఖండ్ లోని డెహ్రాదూన్ - ముస్సోరీ రహదారి మధ్యలో కుర్చీ వేసుకొని మందు తాగుతున్న వీడియోను తయారు చేసి.. లోకం మీదకు వదిలాడు. అందులో అతగాడు రోడ్డు మధ్యలో మద్యం సేవిస్తూ ఉంటే.. వెనుక నుంచి రోడ్స్ ఆప్నే బాప్ కీ అన్న  పాట వచ్చేలా చేశాడు. అంటే.. ఈ రోడ్డు మా బాబుది అంటూ తనలోని అతి మొత్తాన్ని ప్రదర్శించాడు ఈ అతిగాడు.

దీంతో.. ఇతగాడి మీద వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఇదే విషయాన్ని రాష్ట్ర డీజీపీ సైతం ప్రకటన చేశారు. దేవభూమిగా పిలిచే ఉత్తరాఖండ్ కల్చర్ ను కటారియా నాశనం చేస్తున్నాడంటూ పలువురు మండిపడుతున్నారు.

ఇతగాడి బలం.. ఇతడి అతి చేష్టలు మొత్తం అతన్ని ఫాలో అయ్యే 6.3 లక్షల మందితోనే అన్న మాట వినిపిస్తోంది. ఇలాంటి వారిని అన్ ఫాలో కావాల్సిన అవసరం ఉంది. భాద్యత లేకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించే వారికి మద్దతు ఇవ్వటం నైతికంగా కూడా తప్పే అవుతుంది.
Tags:    
  • SocialMediaInfluencer 
  • BodyBuilder 
  • BobbyKataria 
  • BobbySmokinginFlight 
  • BobbyKatariaDrinkingonMussorieRoads 

Similar News

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

Copyright @2026

Powered by Blink CMS