బీజేపీ ట్విట్టర్ వైసీపీని ఫాలో ఫాలో ...?
ఫాలో ఫాలో అని పాడుకుంటూ వైసీపీని బీజేపీ అనుసరిస్తోందా. బీజేపీ ట్విట్టర్ ఇపుడు వైసీపీలాగానే అచ్చం కూత పెడుతోంది అంటున్నారు. వైసీపీకి అయితే చంద్రబాబు ఏం చేసినా వ్యతిరేకతే ఉంటుంది. నిలువెల్లా ఆయన మీద విషం కక్కుతూనే ఉంటుంది. ప్రధాన ప్రత్యర్ధిగా బాబు వైసీపీకి ఉన్నారు కాబట్టి ఆ రాజకీయ పోరాటం ఎపుడూ ఒక రేంజిలో సాగుతోంది.
నిన్న కందుకూరు నేడు గుంటూరు అంటూ వైసీపీ ట్విట్టర్ హ్యాండిల్స్ ఒక్క లెక్కన మోత మోగిస్తునాయి. వైసీపీ మంత్రుల నుంచి ఆ పార్టీ ద్వారా పదవులు పొందిన వారు కీలక నాయకులు ఇలా చాలా మంది చంద్రబాబుని దారుణంగా విమర్శలు చేస్తున్నారు. అయితే వైసీపీ ట్విట్టర్ హ్యాండిల్స్ అన్నీ ఐ ప్యాక్ చేతుల్లో ఉంటాయి కాబట్టి బాబు మీద వారి రాజకీయ విమర్శలు అంతా ఊహిస్తూనే ఉంటారు.
ఏకంగా శవ రాజకీయాలకే వైసీపీ దిగిపోతోంది. బాబుని నర హంతకుడిగా చిత్రీకరిస్తోంది. ఎపుడో జరిగిన గోదావరి పుష్కరాల నుంచి లెటెస్ట్ గా జరిగిన గుంటూరు వరకూ తెగనాడుతూ బాబుకు పేద ప్రజల ప్రాణాలు లెక్కలేవు అంటూ విరుచుకుపడుతోంది.
మరి బీజేపీ అదే రేంజిలో రియాక్ట్ ఎందుకు అవుతోంది అన్న డౌట్లే ఇపుడు చాలా మందికి కలుగుతున్నాయి. నిజానికి బీజేపీకి వైసీపీ తరహా శవ రాజకీయాలు చేయాల్సిన సీన్ కానీ అవసరం కానీలేదు. పైగా బాబుని అంటే తమ భుజాలు కూడా తడుముకోవాల్సి వస్తుంది. ఈ మధ్యనే గుజరాత్ లో కేబుల్ వంతెన దుర్ఘటన అందరికీ గుర్తుండే ఉంటుంది. అదొక్కటే కాదు చాలా ఫ్లాష్ బ్యాక్ కధలు తవ్వి తీయగలరు ప్రత్యర్ధులు.
అందుకే బీజేపీ నేతలు పెద్దగా మాట్లాడకుండా ఉంటారు. కానీ ఇపుడు చిత్రంగా బీజేపీ ట్విట్టర్ హ్యాండిల్స్ కూడా మోత మోగించేస్తున్నాయి. వైసీపీ వేడిని వాడిని అందిపుచ్చుకుని మరీ హోరెత్తిస్తున్నాయి. పైగా బీజేపీ నాయకులు ఎక్కడా బహిరంగంగా అనని మాటలు అన్నీ ట్విట్టర్లలో కనిపిస్తునాయి. ఇలా ఎందుకు అన్నదే చర్చగా ఉంది. అయితే దాని వెనక ఏమి జరిగి ఉంటుంది. ఏమై ఉంటుంది అన్నది మాత్రం బీజేపీలోనే ఆశ్చర్యంగా ఉందిట.
ఈ మధ్యనే బీజేపీ సోషల్ మీడియా విభాగం బాధ్యతలను ఆ పార్టీ సీనియర్ నేత విష్ణు వర్ఘన్ రెడ్డికి అప్పగించారు అని అంటున్నారు. సోము వీర్రాజు ఎంతో నమ్మకంతో విష్ణు వర్ధన్ రెడ్డికి బాధ్యతలు అప్పగిస్తే ఆయన ఇంకా చార్జి తీసుకున్నారో లేదో కానీ బీజేపీ ట్విట్టర్ కూడా వైసీపీ కూతలే కూస్తోంది అన్న విమర్శలు ఎక్కువ అవుతున్నాయట.
మరి ఈ ట్వీట్లు అన్నీ జగన్ మీద అభిమానాన్ని చంద్రబాబు మీద ద్వేషాన్ని చూపిస్తున్నాయని అంటున్నారు. మరి దీన్ని సోషల్ మీడియా విభాగం చెక్ చే
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.