తెలంగాణలో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్.. జయసుధ ఎంట్రీ ?

Update: 2022-08-09 08:31 GMT
తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టింది. తెలంగాణలో మరింత బలపడే విధంగా వివిధ పార్టీల నేతల చేరికలపై ఫోకస్ పెట్టింది. తెలంగాణలో బీజేపీ ఆపరేషన్ ఆకర్షణ వేగవంతం చేసింది. ఇప్పటికే కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పిన రాజగోపాల్ రెడ్డి త్వరలోనే బీజేపీలో చేరబోతున్నాడు.

తాజాగా ప్రముఖ సీనియర్ సినీ నటి, రాజకీయ నాయకురాలు జయసుధ బీజేపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం.  ఈ మేరకు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తాజాగా జయసుధతో భేటి అయినట్లు తెలుస్తోంది.

ఈనెల 21న బీజేపీలో చేరాలని జయసుధను ఈటల కోరారు. ఈటల రాజేందర్ స్వయంగా వెళ్లి జయసుధతో సంప్రదింపులు జరుపుతున్నారు. 21న తెలంగాణలోని మునుగోడులో కేంద్రహోంమంత్రి అమిత్ షా మునుగోడులో పర్యటించనున్నారు. ఈ పర్యటన సమయంలో అమిత్ షా సమక్షంలో జయసుధ కాషాయ కండువా కప్పుకోనున్నారు.

నాటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రోద్బలంతో 2009 ఎన్నికలలో సికింద్రాబాద్ నుంచి పోటీ చేసి జయసుధ ఎమ్మెల్యేగా గెలిచారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అకాల మరణం తర్వాత కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పారు.

సికింద్రాబాద్ నియోజకవర్గంలో జయసుధకు కొంత పట్టుంది. 2016లో టీడీపీలో చేరారు జయసుధ. టీడీపీకి గుడ్ బై చెప్పేసి 2019 ఎన్నికల సమయంలో హైదరాబాద్ లోటస్ పాండ్ లో వైఎస్ జగన్ నివాసంలో  జయసుధ వైసీపీలో చేరారు. గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న జయసుధ ఇప్పుడు బీజేపీ వైపు దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
 
టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి బీజేపీలో ఎమ్మెల్యేగా గెలిచిన ఈటల రాజేందర్ బీజేపీలో కొద్దిరోజులుగా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆయన వరుసగా సీనియర్లు, టీఆర్ఎస్ లోని కీలక నేతలకు గురిపెడుతున్నారు.
Tags:    

Similar News