ఓడిపోయే స్థానం.. బీజేపీకి దానం

Update: 2017-02-19 06:14 GMT
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు మిత్రపక్షం బీజేపీకి పెద్ద సాయం చేశారట. ఉత్తరాంధ్ర పట్టభద్రుల స్థానాన్ని వారికి కేటాయించి మేలు చేశారట. దీంతో బీజేపీ నేతలు ఆయనకు ఎంతగానో థ్యాంక్సు చెప్పుకొంటున్నారు. అయితే... ఉత్తరాంధ్ర ప్రాంతీయులు మాత్రం ఆ స్థానాన్ని తీసుకున్న బీజేపీని చూసి నవ్వుతున్నారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల స్థానంలో బీజేపీ ఎలా నెగ్గుతుందనుకుంటుందో ఏమో అంటూ నవ్వుతున్నారు.
    
అందుకు కారణం ఉంది... ఈ స్థానం నుంచి ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న శర్మకు తిరుగులేని ఆదరణ ఉంది.  ప్రజా సమస్యలపై ఈ స్థాయిలో ప్రత్యక్ష పోరాటం చేసే... సభలో ప్రస్తావించే నాయకుడు ఇంకొకరు ఉండరు.  ఉత్తరాంధ్ర ప్రాంత ఉద్యోగులు - కాంట్రాక్టు - అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు - నిరుద్యోగులు - ఇతర ప్రజలు అందరికీ శర్మ సుపరిచితులు. ఆయనకు ఫోన్ చేస్తే సమస్య వినకుండా పక్కన పెట్టడమన్నది లేదు. వినతి పత్రం ఇస్తే బుట్టలో వేసేయడం తెలియదు. సమస్యను పూర్తిగా తెలుసుకుని, బాధితులతో మాట్లాడి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి  ప్రయత్నించడం ఆయన అలవాటు. దీంతో తమ సమస్యలు తీరాలంటే  శర్మే ఎమ్మెల్సీగా ఉండాలనుకుంటారు ఇక్కడివారు. అందుకే ఆయనే ప్రతిసారీ గెలుస్తూ వస్తున్నారు.
    
అలాంటి స్థానంలో కాంగ్రెస్ నుంచి యడ్ల ఆదిరాజు గతంలో పోటీ చేసి చిత్తుగా ఓడారు. ఈసారీ ఆదిరాజే కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు. శర్మపై గెలవడం కష్టమని తెలిసే టీడీపీ ఆ స్థానం గురించి ఆలోచించలేదు. తెలివిగా బీజేపీకి కట్టబెట్టేసింది. పాపం... టీడీపీ, బీజీపీలకు బలం ఉన్న చోట్ల గెలవడమే బీజేపీకి కష్టం. అలాంటిది... శర్మ లాంటి నేతపై పోటీ చేసి గెలవడం బీజేపీ నేతలకు అసాధ్యమనే అంటున్నారు. దీంతో ఈ విషయంలో చంద్రబాబు తెలివితేటలు.. బీజేపీ నేతల పిచ్చితనం చూసి నవ్వుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News