కిమ్ 25 మంది కన్యలను ఎంపిక చేసుకుంటాడు... తప్పించుకున్న యువతి!

ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ గురించి వెలుగులోకి వచ్చే ప్రతీ అంశమూ వైరల్ గా మారుతుందనేది తెలిసిన విషయమే.

Update: 2024-05-02 04:30 GMT

ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ గురించి వెలుగులోకి వచ్చే ప్రతీ అంశమూ వైరల్ గా మారుతుందనేది తెలిసిన విషయమే. ఈ క్రమంలో తాజాగా మరో సంచలన విషయం తెరపైకి వచ్చింది. ఇది... కిమ్ "ప్లెజర్ స్క్వాడ్" గురించి కావడంతో ఒక్కసారిగా వైరల్ గా మారింది. కాగా... ఈ విషయాలు వెల్లడించింది.. ఉత్తర కొరియా నుంచి తప్పించుకుని వెళ్లిపోయిన ఒక యువతి కావడం గమనార్హం.

అవును... ఉత్తర కొరియా నుండి తప్పించుకున్న యోన్మీ పార్క్ అనే యువతి అక్కడ కిమ్ జోంగ్ ఉన్ "ప్లెజర్ స్క్వాడ్" గురించి సంచలన విషయాలు వెల్లడించారు! ఇందులో భాగంగా... కిమ్ తన "ప్లెజర్ స్క్వాడ్"లో చేరడానికి ఏటా 25 మంది కన్యలైన అమ్మాయిలను ఎంపిక చేసుకుంటాడని తెలిపారు. ఇదే సమయంలో ఆ ఎంపిక ప్రక్రియనూ వివరించారు. ఈ వ్యవహారంలో తన అనుభవాన్ని కూడా ఆమె వెల్లడించారు.

కిమ్ "ప్లెజర్ స్క్వాండ్" కోసం తాను రెండుసార్లు స్కౌట్ చేశానని, అయితే తన కుటుంబ స్థితి కారణంగా ఎంపిక చేయలేదని యోన్మీ పార్క్ వెల్లడించింది. ఈ సందర్భంగా... అభ్యర్థులను గుర్తించేందుకు అధికారులు తరగతి గదులు, పాఠశాల యార్డులను సందర్శిస్తారని ఆమె వివరించారు. వారు కొంతమంది అందమైన అమ్మాయిలను కనుగొన్న తర్వాత, వారు చేసే మొదటి పని వారి కుటుంబ స్థితిని, వారి వారి రాజకీయ స్థితిని తనిఖీ చేయడమే అని వెల్లడించారు.

Read more!

"ప్లెజర్ స్క్వాడ్" మూలాలు!:

ఈ సందర్భంగా పార్క్.. ఈ "ప్లెజర్ స్క్వాడ్" గురించి మరిన్ని వివరాలను వెల్లడించారు. ఈ టీం ఎంపిక ప్రక్రియలో కన్యత్వాన్ని ధృవీకరించడానికి వైద్య పరీక్షలతో సహా కఠినమైన పరిశీలన ఉంటుందని ఆమె తెలిపింది. ఈ సమయంలో... చిన్న చిన్న మచ్చలు వంటి చిన్న లోపాలు కూడా అనర్హతకు దారితీయవచ్చని వెల్లడించింది. ఇక్కడ వారి ఏకైక ఉద్దేశ్యం నియంత కోరికలను తీర్చడం మాత్రమే అని ఆమె స్పష్టం చేసింది.

ఈ "ప్లెజర్ స్క్వాడ్" మూలాలు 1970లలో కిమ్ జోంగ్ ఉన్ తండ్రి కిమ్ జోంగ్ ఇల్ యుగం నాటివని.. కిమ్ జోంగ్ ఇల్ మొదట్లో తన తండ్రి కిమ్ ఇల్ సుంగ్ (కిమ్ జోంగ్ ఉన్ తాత)ని సంతోషపెట్టడానికి, అతని వారసత్వాన్ని కాపాడుకోవడానికి ఈ భావనను రూపొందించాడని పార్క్ వివరించారు. కిమ్ జోంగ్ ఇల్ పొడవాటి మహిళలను ఇష్టపడతారని.. అయితే కిమ్ జోంగ్ ఉన్ మాత్రం సన్నగ ఉంటూ వెస్ట్రన్ కల్చర్ లో కనిపించే లక్షణాలను ఇష్టపడతారని తెలిపింది.

కాగా... కిమ్ జోంగ్ ఇల్... యుక్త వయస్సులో ఉన్న అమ్మాయిలతో లైంగిక సాన్నిహిత్యాన్ని కలిగి ఉండటం అమరత్వాన్ని ఇస్తుందని నమ్మాడట. అయినప్పటికీ అతడు 2011లో 70 సంవత్సరాల వయస్సులో గుండెపోటుతో మరణించాడు.

Tags:    

Similar News