ఆఫీస్‌ పికాకింగ్‌.. ఈ సరికొత్త ట్రెండ్ గురించి తెలుసా?

ఈ క్రమంలోనే ఆఫీస్‌ ను అందంగా అలంకరించడం, కిచెన్లు, మొదలైన సౌకర్యాలను ఏర్పాటుచేస్తున్నాయి! ప్రస్తుతం ఇదే కొత్త ట్రెండ్ గా కొనసాగుతోంది!

Update: 2024-05-02 04:12 GMT

కోవిడ్-19 వల్ల వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ సంస్కృతికి కార్పొరేట్ ఉద్యొగులు బాగా అలవాటైనట్లు చెబుతున్న సంగతి తెలిసిందే. దీతో ఆ మహమ్మారి తీవ్రత ముగిసిన తర్వాత కూడా కొన్ని కంపెనీలూ రిమోట్‌ వర్క్‌ సంస్కృతిని ప్రోత్సహించాయి. ఫలితంగా.. ఉద్యోగులు ఈ విధానానికి బాగా అలవాటుపడ్డారు. అయితే ఇప్పుడు ఉద్యోగులను ఆఫీసులకు రప్పించడం కంపెనీలకు తలకుమించిన భారంగా మారిందని అంటున్నారు.

ఈ క్రమంలో... ఆఫీసులకు రావాలని చెబుతున్నా కూడా సదరు ఉద్యోగుల నుంచి అంతగా స్పందన ఉండడం లేదనేది సంస్థల ఫిర్యాదుగా ఉంది. దీంతో ఆయా కంపెనీలు కొత్త స్కెచ్‌ వేస్తూ.. అందులో భాగంగా.. ఉద్యోగులను రప్పించేందుకు ఆఫీసుల్లో మరింత మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నాయట. ఈ క్రమంలోనే ఆఫీస్‌ ను అందంగా అలంకరించడం, కిచెన్లు, మొదలైన సౌకర్యాలను ఏర్పాటుచేస్తున్నాయి! ప్రస్తుతం ఇదే కొత్త ట్రెండ్ గా కొనసాగుతోంది!

అవును... కార్పొరేట్‌ ప్రపంచంలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త ట్రెండ్‌ లు పుట్టుకొస్తూనే ఉంటాయనే సంగతి తెలిసిందే. వీటిలో కొన్ని ట్రెండ్ లు ఎంప్లాయీస్ సృష్టిస్తే.. ఇప్పుడు చెప్పుకోబోయే ట్రెండ్ ని యాజమాన్యాలు సృష్టించాయని అంటున్నారు. అలా పుట్టుకొచ్చిన ఈ కొత్త ట్రెండే "ఆఫీస్‌ పికాకింగ్‌". దీని ముఖ్యఉద్దేశం... పైన చెప్పుకున్నట్లు పని ప్రదేశంలో ఆహ్లాదకర వాతావరణం కల్పించి, ఉద్యోగుల్ని ఆఫీసులకు రప్పించడం!

Read more!

దీంతో... ఈ ట్రెండ్ ని చాలా కంపెనీలు ఫాలో అవుతున్నాయని చెబుతున్నారు. ఇదే విషయాన్ని వెల్లడిస్తున్నారు ఓవెల్ ల్యాబ్స్‌ సీఈఓ ఫ్రాంక్‌ వీషెఫ్ట్‌. ఇందులో భాగంగా... చాలావరకు కంపెనీలు ఇదే పద్ధతిని అనుసరిస్తున్నాయని తెలిపారు. కొవిడ్‌ వచ్చి నాలుగేళ్లు పూర్తయినా ఉద్యోగులు పూర్తిస్థాయిలో కార్యాలయాలకు రాకపోవడంతోనే... పలు కంపెనీలు ఈ పద్ధతిని అనుసరిస్తున్నాయని చెబుతున్నారు. ఇదే సమయంలో... ఉద్యోగులు కూడా వీటి నుంచి తప్పించుకోవడానికి తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారని వెల్లడించారు.

Tags:    

Similar News