ఏపీలో ఈ వారంలో పెను సంచలనమా !?

ఏపీలో ఎన్నికలు పట్టుమని పది రోజులకు వచ్చేశాయి. ఏమైనా జరిగితే ఒక్క వారంలోనే జరగాలి.

Update: 2024-05-02 04:37 GMT

ఏపీలో ఎన్నికలు పట్టుమని పది రోజులకు వచ్చేశాయి. ఏమైనా జరిగితే ఒక్క వారంలోనే జరగాలి. అంటే అచ్చంగా ఏడు రోజులు మాత్రమే వ్యవధి ఉంది. ఆ తరువాత జరగదు జరిగినా నో యూజ్. అంటే ఈ వారంలో పెను సంచలనం నమోదు కావాలి. అది జరుగుతుందా లేదా అంటే అంతా ఢిల్లీ వైపే ఆసక్తిగా చూస్తున్నారు.

ఏపీలో పెన్షన్ల కధ మళ్లీ మొదటికే వచ్చింది. ఒకటవ తేదీకి పెన్షన్లు పడ్డాయని చెబుతున్నా నోటు ముఖం చూసిన అవ్వా తాతలు అయితే అతి తక్కువ మంది. ఒక వైపు మేడే తో బ్యాంకులకు సెలవు, మరో వైపు ఏటీఎంలు వెతుకులాట పెద్ద తలకాయ నొప్పి. ఏటీఎం కార్డులు లేకపోతే బ్యాంకుల ముందు భారీ క్యూలు.

దాంతో పెన్షనర్లకు ఏప్రిల్ కంటే కూడా మే లో ఇంకా దారుణమైన పరిస్థితి ఏర్పడింది అంటున్నారు. ఈసీ ఆదేశాలు ఇచ్చినా ప్రభుత్వం మాత్రం చేయాలనుకున్నదే చేసింది అని విపక్షాలు గుర్రుమంటున్నాయి. ఈ దెబ్బతో అమీ తుమీకి సిద్ధం అంటున్నాయి. ఈ మొత్తం తతంగం అంతా కూడా సీఎస్ ని గురి పెట్టేలా ఉంది అని అంటున్నారు.

టీడీపీ కూటమిలో బీజెపీ ఉంది. ఇపుడు బీజేపీ పెద్దల మీద ఒత్తిడి పెట్టి అయినా సీఎస్ ని బదిలీ చేయించాలన్నదే పట్టుదలగా ఉంది అని అంటున్నారు. బీజేపీ పెద్దల నుంచి ఈ మేరకు అనుకూలమైన వార్త వస్తుందా లేదా అన్నదే చర్చగా ఉంది.

Read more!

ఒక వేళ వస్తే ఒకలా రాకపోతే మరోలా ఏపీ కూటమి తీరు ఎలక్షన్ వార్ ఉండే అవకాశం ఉంది అని అంటున్నారు. బీజేపీకి ఇచ్చిన ఆరు ఎంపీ పది అసెంబ్లీలలో అస్మదీయులు తస్మదీయులను చూసుకుని మరీ వ్యవహరించాలన్నది కూడా పసుపు శిబిరంలో సాగుతున్న మరో చర్చ అని గుసగుసలు అయితే వినిపిస్తున్నాయి.

కూటమి కట్టినందుకు ఏ మేలూ చేయకపోతే ఎలా అన్నదే ఇపుడు వేధిస్తున్న ప్రశ్న. పెన్షనర్లకు తిప్పలు అన్నీ ఇన్నీ కావు. వారు ఇపుడు పూర్తిగా యాంటీ అవుతారని భయాందోళనలు కూడా ఉన్నాయని అంటున్నారు. అదే టైం లో ఏపీలో ఎలక్షనీరింగ్ సవ్యంగా సాగాలీ అంటే డీజీపీని కూడా బదిలీ చేయించాలని కూడా డిమాండ్ పెడుతున్నారు.

బహుశా మే 7, 8 తేదీలలో మోడీ ఏపీ టూర్ ఉంటుందని అంటున్నారు. అప్పటికి కనుక బిగ్ షాట్స్ బదిలీలు జరిగితే ఏపీలో పెను రాజకీయ సంచలనమే నమోదు అవుతుంది అని అంటున్నారు. అలా కాకుండా జరిగితే మాత్రం ఏపీలో మోడీ టూర్ కూడా ఉండదని ఏపీలో కూటమితో కలసి బీజేపీ అగ్ర నేతల ప్రచారం కూడా ఉండే చాన్స్ లేదని అంటున్నారు. చూడబోతే అటూ ఇటూ గట్టిగా లాగుతున్న నేపధ్యమే కనిపిస్తోంది. ఏమి జరుగుతుంది అన్న దానిని బట్టే ఏపీలో రాజకీయ మలుపులూ పిలుపులూ కూడా తెలిసిపోతాయని అంటున్నారు. జస్ట్ వెయిట్ అండ్ సీ.

Tags:    

Similar News