విశాఖలో బొత్సా ఝాన్సీకి అవే ప్లస్ గా మారాయంట!

దీంతో... ఈ అంశం వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్సా ఝాన్సీకి కలిసొతుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

Update: 2024-05-02 04:21 GMT

ఏపీలో సార్వత్రిక ఎన్నికల సందడి చివరి దశకు చేరుకుంటుంది! సుమారు మరో పది రోజుల్లో పోలింగ్ జరగనున్న నేపథ్యంలో... అభ్యర్థులంతా ప్రచారాలతో హోరెత్తించేస్తున్నారు. ఈ సమయంలో అన్ని పార్టీలూ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న విశాఖ లోక్ సభ స్థానం విషయంలో ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. అక్కడ ఓటర్లు స్థానికతతో పాటు సీనియారిటీని కూడా పరిగణలోకి తీసుకుంటున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

అవును... అన్ని పార్టీలకూ విశాఖ లోక్ సభ స్థానం ఇప్పుడు ప్రతిష్టాత్మకంగా స్థానంగా ఉందని అంటున్నారు. పైగా... అధికారంలోకి వచ్చిన అనంతరం విశాఖే ఏపీ రాజధాని అని జగన్ ఏకంగా మేనిఫెస్టోలూ కూడా ప్రకటించడంతో ఆ అంశానికి క్రెడిబిలిటీతో పాటు ప్రాధాన్యతా పెరిగిందని చెబుతున్నారు. దీంతో... ఈ అంశం వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్సా ఝాన్సీకి కలిసొతుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఇదే క్రమంలో.. ప్రధానంగా.. గతంలో పార్లమెంట్ లో బొత్సా ఝాన్సీ మాట్లాడిన విషయాలు, లేవనెత్తిన అంశాలు నాడు ఉత్తరాంధ్రలో ఎంపీలుగా ఉన్నావారెవరూ ఎవరూ మాట్లాడలేదనే విషయం ఇప్పుడు అక్కడ చర్చనీయాంశం అవుతుంఅని తెలుస్తుంది. నాడు.. బొబ్బిలి, విజయనగరం ఎంపీగా ఉన్నప్పుడు బొత్సా ఝాన్సీ ప్రస్థావించిన అంశాలు, మాట్లాడిన విషయాలే ఇప్పటికి పార్లమెంట్ మినిట్స్ బుక్స్ లో హైలెట్ గా ఉన్నాయని అంటున్నారు.

ఇదే సమయంలో... ఎన్నికల సమయం వచ్చిందంటే చంద్రబాబు లాంటి వాళ్లు రావడం, అరచేతిలో వైకుంఠం చూపించడం, అలవికాని హామీలివ్వడం, అనంతరం అడ్రస్ లేకుండా పోవడం జరుగుతోందే తప్ప, సమస్యలను పరిష్కరించే నాథుడే కనిపించ లేదనే చర్చ వినిపిస్తుందని అంటున్నారు! ఈ సమయంలో అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు గాల్లోనే తిరుగుతాడు తప్ప, నేలమీదకు రావడాన్ని ఎప్పుడూ చూడలేదనే చర్చ కూడా ఇప్పుడు విశాఖలో బలంగా వినిపిస్తుందని చెబుతున్నారు!

Read more!

ఈ క్రమంలోనే బొత్సా ఝాన్సీ అయితే చురుకుగా ఉంటారని.. అన్నింటా దూసుకుపోతూ వేగంగా నిర్ణయాలు తీసుకుంటారని.. ధైర్యంగా మాట్లాడతారని.. సన్నాయి నొక్కులు నొక్కరని చెబుతున్నారు! ఇదే సమయంలో... ఉత్తరాంధ్ర సమస్యలపై ఝాన్సీకి సమగ్ర అవగాహన ఉండటంతో పాటు ఉన్నత విద్యావంతురాలిగా కూడా ఉండటం ఆమెకు మరింతగా కలిసి వస్తుందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి శ్రీ భరత్ పై కొన్ని పెదవి విరుపు కామెంట్లు వినిపిస్తున్నాయని తెలుస్తుంది. ఇందులో భాగంగా... శ్రీ భరత్ అసలు సామాన్యుల దగ్గరికే వెళ్లడం లేదని.. వాళ్లని దూరం నుంచే చూసుకుంటూ, కారు దిగకుండా చేయి ఊపుకుంటూ వెళ్లిపోతున్నారని అంటున్నారు. ఇదే సమయంలొ... గట్టిగా ఒక సమస్యపై మాట్లాడమంటే అవగాహన లేని అన్ని విషయాలు చెబుతారనే చర్చ విశాఖలో బలంగా నాడుస్తుందని చెబుతున్నారు.

ఈ విధంగా పార్టీ అధినేత తీసుకున్న నిర్ణయాలు, ఆమెపై ప్రజల్లో ఉన్న అభిప్రాయం వంటి బలాలతో పాటు.. ప్రత్యర్థుల బలహీనతలు కూడా బొత్సా ఝాన్సీకి కలిసి వస్తున్నాయనే చర్చ విశాఖ లోక్ సభ నియోజకవర్గ పరిధిలో బలంగా వినిపిస్తుందని తెలుస్తుంది!

Tags:    

Similar News