పిఠాపురం ఓటర్ ఫుల్ సైలెన్స్ !

జనసేనాని కంటే పవర్ స్టార్ పదమే పవర్ ఫుల్. అదే అభిమానులకు ఊపు. దానిని చూసే వారు పవన్ వెంట పడి వస్తున్నారు.

Update: 2024-05-02 04:36 GMT

జనసేనాని కంటే పవర్ స్టార్ పదమే పవర్ ఫుల్. అదే అభిమానులకు ఊపు. దానిని చూసే వారు పవన్ వెంట పడి వస్తున్నారు. పవన్ అంటే వారికి దేవుడు ఎలా అయ్యారు అంటే పవర్ స్టారిజాన్ని చూసే. మరి అంతటి పవర్ స్టార్ కి పక్కన స్టార్లు ఉండాలా. అది కూడా ఇబ్బడి ముబ్బడిగా ఉండాలా అన్నది ఒక ప్రశ్న.

అలా పవన్ కళ్యాణ్ మీద భారీ సెటైర్ వేశారు పిఠాపురం వైసీపీ అభ్యర్ధి వంగా గీత. పవర్ స్టార్ లక్ష ఓట్ల మెజారిటీ అన్న దానికి ఆమె కౌంటర్ వేసారు. లక్ష ఓట్ల మెజారిటీ వస్తే ఎందుకు ఇంతమందిని పిఠాపురం అంతటా తిప్పుతున్నారు అని సూటిగా ప్రశ్నిస్తున్నారు.

జబర్దస్త్ కళాకారులు, టీవీ సీరియల్ కళాకారులు ఇలా ఒకరేమిటి అందరినీ తిప్పేస్తున్నారు. పైగా ఎక్కడ నుంచో గూడాలు వస్తున్నారు అని అంటున్నారు. బయట వారు వస్తే ఖబడ్దార్ అని అంటున్నారు అని గీత ఫైర్ అయ్యారు.

నిజానికి బయట వారు ఎవరో అందరికీ తెలుసు అని ఆమె అంటున్నారు. మేము పక్కా లోకల్ మా అందరికీ పిఠాపురం అని ఆమె చెప్పుకున్నారు. బయట నుంచి వచ్చిన వారే బయట వారు అని అంటూంటే ఏమి చెప్పాలని ఆమె మీడియా ముందు సెటైర్లు వేశారు.

Read more!

తాము ఎవరి మీద విమర్శలు చేయకుండా తమ ప్రచారం చేసుకుంటున్నామని అన్నారు. మేము ప్రజలకు ఏమి చేశామో చెప్పుకుంటున్నాం, పాజిటివ్ వేవ్ మాకే ఉంది అని ఆమె అంటున్నారు. లక్ష మెజారిటీ అని మేము చెప్పమని ఆమె హాట్ కామెంట్స్ చేశారు.

మరో వైపు చూస్తే జబర్దస్త్ టీం అంతా పిఠాపురంలోనే ఉంది. అలాగే ఎన్నారైలు కూడా పిఠాపురానికి క్యూ కడుతున్నారు. ఎవరికి వారు పవన్ కోసం విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. మేము రాకపోయినా లక్ష ఓట్లే. అయినా మా అభిమానం కొద్దీ ప్రచారం చేస్తున్నామని జబర్దస్త్ కళాకారులు అంటున్నారు.

సుడిగాలి సుధీర్ కొత్తగా ప్రచారం లో యాడ్ అయ్యారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ తాము సినిమాల్లోకి రాకముందు నుంచి చిరంజీవి పవన్ కళ్యాణ్ వీరాభిమానులమని అన్నారు. అందుకే వారి మీద ప్రేమతోనే తాము వచ్చామని తాము రాకపోయినా పవన్ కి భారీ మెజారిటీ ఖాయమని అంటున్నారు.

ఇక వైసీపీ వైపు నుంచి చూస్తే మిధుని రెడ్డి స్కెచ్ గీస్తున్నారు. అలాగే కాకినాడ సిటీ వైసీపీ అభ్యర్ధి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తన నియోజకవర్గం వదిలేసి మరీ పిఠాపురం లో మకాం వేశారు. కాపు నేత ముద్రగడ పద్మనాభం అయితే కాపులతో ఆత్మీయ భేటీలు పెడుతూ చాప కింద నీరులా జనసేనను ఓడించే పనిలో బిజీగా ఉన్నారు. మొత్తం మీద పిఠాపురం ఓటర్లు మాత్రం ఫుల్ సైలెంట్ గా ఉన్నారు. ఎవరికి ఓటు వేస్తారు ఎవరిని గెలిపిస్తారు అన్నది సస్పెన్స్ అంతే.

Tags:    

Similar News