ఇది తింటే లైంగిక కోరికలు రెట్టింపు... ఇంకా ఎన్నో ప్రయోజనాలు కూడా...!

ఈ సమయంలో... షిలాజిత్‌ తినడం వల్ల స్త్రీ, పురుషులలో లైంగిక కోరక మెరుగుపడుతుందని అంటున్నారు!

Update: 2024-05-02 04:16 GMT

మారుతున్న ఆహారపు అలవాట్లు, ఒత్తిడితో కూడిన ఉద్యోగాలు, మరికొన్ని అలవాట్ల వల్ల ఈ మధ్యకాలంలో స్త్రీ, పురుషుల్లో లైంగిక కోరికలు తగ్గుముఖం పడుతున్నాయని అంటున్నారు! ఈ సమస్యను చాలా మంది దంపతులు ఎదుర్కొంటున్నారని చెబుతున్నారు. ఈ సమయంలో... షిలాజిత్‌ తినడం వల్ల స్త్రీ, పురుషులలో లైంగిక కోరక మెరుగుపడుతుందని అంటున్నారు!

అవును... ఆయుర్వేదంలో శతాబ్దాలుగా ఉపయోగించబడుతున్న ఒక సహజ పదార్థం అయిన షిలాజిత్ లో... ఖనిజాలు, సేంద్రియ సమ్మేళనాలు ఉంటాయని చెబుతున్నారు. ఇదే క్రమంలో... ఇందులో హ్యుమిక్ యాసిడ్, ఫుల్విక్ యాసిడ్, ఐరన్ వంటి ఇతర ఖనిజాలు ఉండటం వల్ల అది స్త్రీ, పురుషులలో లైంగిక కోరకను మెరుగుపరుస్తుందని చెబుతున్నారు.

దీంతో... షిలాజిత్ పురుషులలో లైంగిక కోరిక, పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుందని.. అదేవిధంగా స్త్రీలలో లైంగిక సంతృప్తిని కూడా మెరుగుపరచడంలో సహాయపడుతుందని నమ్ముతారట! ఇదే క్రమంలో... శుక్ర కణాల సంఖ్య, వాటి కదలిక, రూపాలను మెరుగుపరచడంలోనూ ఈ షిలాజిత్ సహాయపడుతుందని కొన్ని అధ్యయనాలు నిరూపించాయని వెల్లడిస్తున్నారు.

అదేవిధంగా... ఈ షిలాజిత్‌ ను తీసుకోవడం వల్ల శారీరక, మానసిక శక్తి పెరగడానికి సహాయపడుతుందని.. దీర్ఘకాలిక అలసట, బలహీనతను తగ్గించడంలోనూ సహకరిస్తుందని అంటున్నారు. ఈ క్రమంలోనే... ఈ షిలాజిత్ లో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇంఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తిని పెంచడానికి, అంటువ్యాధులకు గురయ్యే ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడతాయని చెబుతున్నారు.

Read more!

ఇదే క్రమంలో... షిలాజిత్ గాయాలను త్వరగా నయం చేయడంలో సహాయపడుతుందని.. ఎముకల సాంద్రతను పెంచడానికి, ఆస్టియోపొరోసిస్ వంటి వయస్సు సంబంధిత ఎముక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుందని నమ్ముతారంట! అదేవిధంగా... జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, మానసిక స్పష్టతను మెరుగుపరచడంలో సహాయపడుతుందని చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే! ఇవి పాటించడం వల్ల ఫలితాలు అనేవి వ్యక్తిగతం మాత్రమే! వీటిని పాటించే ముందు వైద్యులను సంప్రదించడం ఉత్తమం అనే విషయం గమనించగలరు.

Tags:    

Similar News