ఎన్ కౌంటర్: చీలిపోయిన బీజేపీ

Update: 2019-12-06 12:50 GMT
దేశ మంతా దిశ హత్య కేసు నిందితులను ఎన్ కౌంటర్ చేసినందుకు హర్షం వ్యక్తమవుతోంది. కానీ దేశాన్ని పాలిస్తున్న బీజేపీ నేతల నుంచి మాత్రం మిశ్రమ స్పందన వ్యక్తమవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

తాజాగా బీజేపీ కేంద్రమంత్రులు, ఎంపీలు అయిన సృతీ ఈరానీ, రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్, ఉమాభారతి సహా బీజేపీ నేతలు నిందితుల ఎన్ కౌంటర్ కు అనుకూలంగా వ్యాఖ్యలు చేసి పోలీసుల చర్యను సమర్థించారు.

అయితే ఇదే  బీజేపీ పార్టీకి చెందిన ఎంపీ మేనకాగాంధీ తాజాగా ఎన్ కౌంటర్ ను వ్యతిరేకించారు. నిందితుల ఎన్ కౌంటర్ ను తప్పుపట్టారు. పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే కోర్టులు - చట్టాలు ఎందుకని ఆమె ప్రశ్నించారు. తెలంగాణ పోలీసులు చేసిన ఎన్ కౌంటర్ ను తప్పుపట్టారు.

ఇక బీజేపీకి చెందిన పశ్చిమ బెంగాల్ ఎంపీ లాకెట్ ఛటర్జీ మాట్లాడుతూ ఇలాంటి ఎన్ కౌంటర్లు చట్ట ప్రకారం న్యాయం కాదని స్పష్టం చేశారు.

ఇలా దేశాన్ని పాలిస్తున్న బీజేపీలోనే తెలంగాణలో జరిగిన ఎన్ కౌంటర్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. నేతలందరూ ఎన్ కౌంటర్ పై రెండుగా చీలిపోయి కామెంట్స్ చేస్తున్నారు.


Tags:    

Similar News