• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  జేసీ కుటుంబానికి బిగ్...

జేసీ కుటుంబానికి బిగ్ షాక్ ..ఆయన పై జిల్లా బహిష్కరణ వేటు ?

By - Tupaki Desk
Update: 2019-12-04 09:00 GMT
మాజీ ఎంపీ దివాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి ఈ ఇద్దరు కూడా గత కొన్నేళ్లుగా అనంతపురం జిల్లాలో రాజకీయాన్ని శాసిస్తూ వస్తున్నారు. అలాగే వీరికి రాజకీయంగా ఉన్న పాపులారిటీ తో వీరు ఆడిందే ఆట, పాడిందే పాటగా ఇన్నేళ్లు వీరి హావ బాగానే నడిచింది. కానీ , గత కొన్ని రోజులుగా జిల్లాలో సంఘవిద్రోహక శక్తులపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ప్రజలపై ఎవరైనా దౌర్జన్యం చేసినట్టు తెలిస్తే వారిని కఠినంగా శిక్షిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు ప్రజలపై దౌర్జన్యం చేసే వారిపై ఉక్కుపాదం మోపుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జేసీ బ్రదర్స్ కి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఎస్‌వీ రవీంద్రా రెడ్డి పై జిల్లా బహిష్కరణకు పోలీసులు రంగం సిద్ధం చేశారు అని విశ్వసనీయ వర్గాల సమాచారం.

సంగటి రవీంద్రా రెడ్డి అలియాస్ పొట్టి రవి 2003  లో జేసీ బ్రదర్స్ తో చేతులు కలిపి ,  నమ్మిన బంటుగా మారాడు. దాడులు, దౌర్జన్యాల విషయం లో జేసీ వర్గానికి పొట్టి రవినే నాయకత్వం వహిస్తుంటాడు. వారి అండదంలతో  రవి ఆగడాలకు హద్దు లేకుండా పోయింది. హత్యాయత్నాలు, దొమ్మిలు, మారణాయుధులు కలిగి ఉండడం వంటి వ్యవహారాల్లో పొట్టి రవిపై ఇప్పటికే  11 కేసులు ఉన్నాయి. కానీ , అప్పట్లో ఎవరు ఆయన్ని టచ్ చేయలేకపోయారు.

2003లో ఇరు వర్గాలు రాళ్లు రువ్వుకున్న ఘటన, 2004లో అక్రమ ఆయుధాలు కలిగి ఉండడంపై కేసు నమోదు , 2015లో అల్ట్రాటెక్ట్‌ సిమెంట్‌ పరిశ్రమలో సామగ్రిని ధ్వంసం చేసిన కేసు, 2017లో తాడిపత్రి మండలం, పెద్దపొలమడ గ్రామం సమీపంలోని ప్రభోదానంద ఆశ్రమానికి చెందిన వాటర్‌ ట్యాంక్‌ దగ్ధం కేసు , 2018లో వినాయక చవితి నిమజ్జన సందర్భంగా చేలరేగిన ఘర్షణలో కేసు , 2019లో వీరాపురం గ్రామానికి చెందిన అనిల్‌కుమార్‌రెడ్డి పై హత్యాయత్నం కేసు ఇలా పలురకాలైన కేసుల్లో రవి నిందుతుడిగా ఉన్నాడు.  ఇన్ని రోజులు జేసీ ఫ్యామిలీ సపోర్ట్ పూర్తిగా ఉండటంతో రవి జోలికి ఎవరు పోలేదు. కానీ , ఇప్పుడు పోలీసులు సీరియస్ గా యాక్షన్ తీసుకుంటుండటం తో అయన అరాచకాలు తెలిసిన జిల్లా ఎస్పీ రవి పై పీడీ యాక్ట్‌ ప్రయోగించారు. తాజాగా జిల్లా బహిష్కరణ వేటు వేయాలని నిర్ణయించినట్లు  సమాచారం.
Tags:    
  • Jc Brothers 
  • Ananthapuram News 
  • Andhra News 
  • Telugu News 
  • Andhra Daily News 
  • Telugu Movie News 
  • Tupaki News 

Similar News

వీఐపీలు వస్తేనే ముంబైకి అందం.. సామాన్యులు ఉంటే ఎందుకీ దుర్గంధం?

2026-11-19 18:30 GMT

సహచరుల వద్ద తలెత్తుకోలేకపోతున్నా.. ఇప్పుడే వైసీపీలోకి వెళ్లిపోండి! – టీడీపీ ఎమ్మెల్యే థామస్ సంచలన వ్యాఖ్యలు

2026-11-19 17:30 GMT

AI హడావుడి.. సినిమాకు ఒరిగిందేంటి!

2026-11-19 17:30 GMT

పార్టీలు, ఫంక్షన్లు జరగాలంటే ఆ రూల్స్ పాటించాలా?

2026-11-19 16:30 GMT

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

Copyright @2026

Powered by Blink CMS