• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  సంచలనంగా భూపాలపల్లి...

సంచలనంగా భూపాలపల్లి ఎక్సైజ్ ఉన్నతాధికారి వెకిలితనం

By - Tupaki Desk
Update: 2020-06-05 07:30 GMT
ఎక్సైజ్ శాఖలో అతడో ఉన్నతాధికారి. పేరుకు పెద్ద అధికారే అయినా మనసు మాత్రం చిన్నది. అతగాడి వెకిలితనం అదే శాఖలో పని చేసే మహిళా సీఐకి శాపంగా మారింది. సదరు ఉన్నతాధికారి వెకిలిచేష్టలు భరించలేని ఆమె.. తాజాగా ఒక మీడియా సంస్థ ముందుకు వచ్చి తన వేదనను వెళ్లబోసుకుంది. తనను ఎంతగా టార్చర్ పెడుతున్నాడో వెల్లడించింది. ఆమె చేస్తున్న ఆరోపణలు ఇప్పుడు సంచలనంగా మారాయి.

భూపాలపల్లి ఎక్సైజ్ సూపరిటెండెంట్ తనను ఎంతలా టార్చర్ పెడుతున్న విషయాన్ని ఎక్సజ్ సీఐ ప్రశాంతి వెల్లడించిన వైనం ఇప్పుడు షాకింగ్ గా మారింది. వాట్సాప్ లో పోస్టులు పెట్టటంతో పాటు.. తానుండే క్వార్టర్ పక్కనే క్వార్టర్ ఇప్పిస్తానని.. అక్కడే ఉండి డ్యూటీ చేయాలని ఇబ్బంది పెడుతున్నట్లు ఆరోపించారు. అంతేకాదు.. భూపాలపల్లి ఇన్ చార్జి సీఐ పోస్టు కూడా ఇప్పిస్తానంటూ ఒత్తిడి తెస్తున్న వైనాన్ని ఆమె బయటపెట్టారు. తనకు పెళ్లి అయ్యిందని.. భర్త ఉన్నాడని.. అతడికి ఉద్యోగం ఉంది.. పాపతో తాను ఒక్కతే ఎలా ఉంటానని చెబితే.. ఏమయితది.. పాపతో ఇక్కడే ఉండమన్నట్లు చెప్పారు.

మొదట్లో సదరు ఉన్నతాధికారి తీరు తెలీక.. అతడు స్వయంగా పాడి పంపిన వాట్సాప్ పోస్టుకు బాగుందని రిప్లై ఇచ్చానని.. అప్పటి నుంచి తనను మరింతగా వేధిస్తున్నట్లు చెప్పారు. తాజాగా ఆమె.. ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ తో పాటు.. భూపాలపల్లి కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. గతంలో పని చేసిన మహిళా అధికారులతోనూ అతడు అలానే వ్యవహరించారని ఆమె చెబుతున్నారు. ఈ వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. అయితే.. ఆమె చేసిన ఆరోపణలపై సదరు అధికారిని మీడియా సంప్రదించగా.. ఫోన్ స్విచాఫ్ అయినట్లుగా తెలుస్తోంది.
Tags:    
  • Bhupalpally Excise ci prashanti 
  • Bhupalpally Excise Superindent 
  • Bhupalpally 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

పార్టీలు, ఫంక్షన్లు జరగాలంటే ఆ రూల్స్ పాటించాలా?

2026-11-19 16:30 GMT

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS