బండ్ల కేసీఆర్ ను అంత మాట అనేశాడు
తన రాజకీయ జీవితంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న బండ్ల గణేష్ కు ఆ ఆశ నెరవేరలేదు. కాంగ్రెస్ టికెట్ దక్కలేదు. ఎంతో నిరాశలో ఉంటాడని భావించాం. కానీ అలా అనుకున్న వారందరికీ షాకిస్తూ బండ్ల గణేష్ మరోసారి వచ్చాడు. టీవీ స్టూడియోల్లో సందడి చేస్తున్నారు. ఓ చానెల్ రేటింగే పరమావధిగా భావించిన ఓ చానెల్ అతడిని తీసుకొచ్చి కూర్చుండ బెట్టి నానా యాగీ చేయించింది.
బండ్ల గణేష్ టికెట్ దక్కని బాధలో ఉంటాడని భావించిన వారికి షాకిస్తూ పదునైన పంచులతో రెచ్చిపోయాడు. కాంగ్రెస్ పై ప్రేమను కనబరుస్తూ ఈసారి కేసీఆర్ టార్గెట్ గా రెచ్చిపోయాడు. ఓ బూతు పదాన్ని వినియోగించాడు. కేసీఆర్ పాలనను ఉద్దేశించి ‘మీరు.... లేక చంద్రబాబును అంటారా ’ అంటూ దారుణ పదజాలం వాడారు. కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు కలిసి పొత్తు పెట్టుకోవడంపై కేసీఆర్ చేస్తున్న విమర్శలకు కౌంటర్ గా ఈ పదం వాడారు.
బండ్ల గణేష్ మాట్లాడుతూ.. అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లినప్పుడు కేసీఆర్ ఏమన్నాడో గుర్తు చేసుకోవాలని సూచించారు. 105 మంది అభ్యర్థులను ప్రకటించేసిన కేసీఆర్ తమకు వేరే వాళ్లతో సంబంధం లేదని అన్నాడని.. సులువుగా గెలుస్తానన్నాడని.. ఇప్పుడు కాంగ్రెస్ - టీడీపీకి ఎందుకు భయపడుతున్నాడని విమర్శించారు. కేసీఆర్ మంచి చేస్తానంటే బాబు అడ్డుకున్నాడా అని ప్రశ్నించారు. తెలంగాణను దోచుకొని కమీషన్ భగీరథ పెట్టమని బాబు చెప్పాడా అని బండ్ల ఫైర్ అయ్యాడు. కేసీఆర్ పాలన అంతా అవినీతి మయం అని.. టికెట్ల కేటాయింపుల్లో రావులను అన్ని సీట్లు ఇస్తారా అని మండిపడ్డారు. మొత్తం ఇన్నాళ్లు ఇంటర్వ్యూల్లో కేసీఆర్ గురించి ఆచితూచి స్పందించిన బండ్ల ఈ ఇంటర్వ్యూల్లో మాత్రం కేసీఆర్ పై నోరుపారేసుకోవడం గమనార్హం. మరి కేసీఆర్ అండ్ టీం బండ్లకు ఎలాంటి సమాధానం ఇస్తుందో వేచి చూడాలి..