'ప‌న‌బాక' వారి ఫైర్‌ మామూలుగా లేదు..షాకింగ్ రీజ‌న్‌.. !

తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్న నాయ‌కుల జాబితాలో మాజీ కేంద్ర మంత్రి ప‌న‌బాక ల‌క్ష్మి ఉన్నార‌ని అంటున్నారు.

Update: 2026-09-21 09:30 GMT

తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్న నాయ‌కుల జాబితాలో మాజీ కేంద్ర మంత్రి ప‌న‌బాక ల‌క్ష్మి ఉన్నార‌ని అంటున్నారు. ఆమెకు పార్టీ ప‌రంగా ప్రాధాన్యం త‌గ్గుతోంద‌న్న‌ది అనుచ‌రుల వ‌ద్ద ఆమె చెబుతున్నారు. వాస్త‌వానికి టీడీపీలో ఉన్న ప‌న‌బాక‌.. గ‌త ఎన్నిక‌ల్లో తిరుప‌తి పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేశారు. కానీ, ఓడిపోయారు. ఆ త‌ర్వాత‌.. అంటే ఏడాదిలోనే.. ఆమెకు తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క‌మండ‌లి బోర్డులో స‌భ్య‌త్వం ఇచ్చారు. అయినా.. కూడా త‌న‌కు ప్రాధాన్యం త‌గ్గుతోంద‌ని ఆమె వాపోతున్నార‌ట‌.

కార‌ణాలు ఇవేనా..?

ప‌న‌బాక ల‌క్ష్మి.. ఎప్పుడో ఉమ్మ‌డి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న స‌మ‌యంలో కేంద్ర స‌హాయ మంత్రిగా ప‌నిచేశారు. ఆ త‌ర్వాత నుంచి ఆమె ఓడిపోతూ వ‌చ్చారు. దీంతో స‌హ‌జంగానే ఇటు ప్ర‌జ‌ల్లోనూ.. అటు పార్టీలోనూ ఆమెకు ప్రాధాన్యం లేకుండా పోయింది. ఇది ప్ర‌ధాన అసంతృప్తికి కార‌ణ‌మ‌ని తెలుస్తోంది. ఇక‌, ప్ర‌స్తుతం టీడీపీ లోనే ఉన్న ఆమె.. త‌న‌కు అనేక అవ‌కాశాలు వ‌చ్చినా వ‌దులుకున్నాన‌ని.. చెబుతున్నారు. 2014 ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీ నుంచి ఆమెకు ఆఫ‌ర్ వ‌చ్చింది. కానీ.. ఆమె వెళ్ల‌లేదు.

ఆ త‌ర్వాత‌.. ఏపీ కాంగ్రెస్ పార్టీ చీఫ్‌గా వైఎస్ ష‌ర్మిల ప‌గ్గాలు చేప‌ట్టారు. ఆ స‌మ‌యంలోనూ 'ఘ‌ర్ వాప‌సీ' కింద‌.. ప‌నబాక‌ను రావాల‌ని ఆహ్వానించారు. అంతేకాదు.. రాష్ట్రంలో కీల‌క పోస్టును కూడా ఆఫ‌ర్ చేసిన‌ట్టు అప్ప‌ట్లో కాంగ్రెస్ నాయ‌కులు చెప్పారు. కానీ.. అప్పట్లోనూ ప‌న‌బాక రాలేదు. ఇక‌, గ‌త ఎన్నిక‌ల్లో ప‌రాజ‌యం త‌ర్వాత‌.. పార్టీ త‌ర‌ఫున రాజ్య‌స‌భ సీటును ఆశించారు. కానీ.. స‌మీక‌ర‌ణ‌లు కుద‌ర‌లేదు. ఆ త‌ర్వాత ఎమ్మెల్సీ పోస్టును కూడా ఆశించారు. కానీ, అది కూడా సాధ్యం కాలేదు.

దీంతో అప్ప‌టి నుంచి ప‌న‌బాక ఫ్యామిలీ అసంతృప్తితోనే ఉంద‌న్న‌ది పార్టీ వ‌ర్గాలు చెబుతున్న మాట‌. మ‌రోవైపు వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి ఇప్ప‌టి నుంచే స‌మీక‌ర‌ణ‌లు మారుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ప‌న‌బాక‌.. తిరుపతి పార్ల‌మెంటు స్థానాన్ని కోరుతున్నారు. దీనిపై అంత‌ర్మ‌థ‌నం కూడా చేస్తున్నారు. క్షేత్ర‌స్థాయిలో ప‌రిస్థితి ఎలా ఉందన్న విష‌యంపై చ‌ర్చిస్తున్నారు. అయితే.. టికెట్ విష‌యంపై ఇప్పుడు ఎందుకు తొంద‌ర‌పడుతున్నార‌న్న‌ది ప్ర‌శ్న‌. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు తిరుప‌తి పార్ల‌మెంటు స్థానాన్ని జ‌న‌సేన ఆశిస్తున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. దీంతో ప‌న‌బాక ముందుగానే ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశారు. మ‌రి ఏమేర‌కు ఆమె అసంతృప్తి చ‌ల్లారుతుందో చూడాలి.

Tags:    

Similar News