బద్వేల్ బైపోల్ : ఈ రోజు తో ప్రచారానికి తెర .. !

Update: 2021-10-27 05:53 GMT
కడప జిల్లా బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గానికి జరగనున్న బై పోల్ కి నేటితో ప్రచారానికి తెర పడనుంది. రాత్రి 7 గంటలకు ప్రచార పర్వం ముగిసిపోతుంది. ఈ నెల 30న బద్వేలు ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. నవంబరు 2న ఓట్ల లెక్కింపు చేపడతారు. 2019 ఎన్నికల్లో బద్వేల్ నుంచి వైసీపీ నుంచి పోటీ చేసి గెలిచిన ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య అకాల మరణంతో నియోజకవర్గంలో ఉప ఎన్నిక ఖాయమైంది. చనిపోయిన ఫ్యామిలీకి ఈ ఉప ఎన్నికల్లో టికెట్ ఇవ్వడంతో చనిపోయిన వారి జ్ఞాపకార్థం టీడీపీ, జనసేనలు పోటీ నుండి వెనక్కి తగ్గారు. బీజేపీ, కాంగ్రెస్ లు మాత్రం పోటీలో నిల్చున్నారు.

గత రెండు రోజులుగా బద్వేల్ ఉప ఎన్నికల్లో ప్రచారం హీటెక్కింది. రూలింగ్ పార్టీ వైసీపీ ప్రచారంలో దూసుకుపోతుంది. వైసీపీ తరపున రెండు రోజులుగా స్టార్ క్యాంపెయిన్ గా ఎమ్మెల్యే రోజా ప్రచారం నిర్వహిస్తున్నారు. బీజేపీ మాత్రం ప్రెస్ మీట్ లకే పరిమితమైంది. కాంగ్రెస్ కనీసం కానరావట్లేదు. ఈ నెల 30న ఉప ఎన్నిక జరగనుంది. నవంబర్ రెండున కౌంటింగ్ జరిపి రిజల్ట్ తెలపనున్నారు. ఇప్పటికే బద్వేల్ ఉప ఎన్నిక కోసం 272 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఇందులో 30 పోలింగ్ కేంద్రాలు సున్నితమైనవిగా గుర్తించారు. 50శాతం పోలింగ్ స్టేషన్లలో సీసీ కెమెరాల పర్యవేక్షణ, లైవ్ వెబ్ స్ట్రీమింగ్ జరుగుతుంది.
Read more!

ఈసారి ప్రచారం ఆపే సమయాన్ని ఈసీ 48 గంటల నుంచి 72 గంటలకు పెంచింది. దీంతో ఎన్నిక జరగటానికి 72 గంటల ముందే ప్రచారాన్ని అభ్యర్ధులు ఆపివేయాల్సి ఉంటుంది. అంటే ఈ రోజు అక్టోబర్ 27 సాయంత్రం 5 గంటలతో ప్రచారానికి తెర పడుతుంది. ఒక్కరోజే ప్రచారానికి సమయం ఉండటంతో ప్రచార హోరు మిన్నంటింది. నేడు బద్వేలులో వైసిపి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించబోతున్నారు. బద్వేలు నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు మకాం వేసి వైసీపీ గెలుపు కోసం కష్టపడుతున్నారు. బీజేపీ మాత్రం ప్రచారం అంతంతమాత్రంగా చేస్తుంది. ఇక కాంగ్రెస్ అసలు పోటీలో ఉందా లేదా అన్నట్టు వ్యవహరిస్తోంది. అయితే ఈ ఎన్నికల్లో వైసీపీ విజయం ఖాయమే అయినప్పటికీ, వైసీపీ మాత్రం పార్టీ అమలు చేసే పథకాలకు రెఫరెండమ్ గా చూస్తుంది కాబట్టి భారీ మెజారిటీ తో విజయం సాధించాలని ప్రయత్నం చేస్తుంది. 
Tags:    

Similar News