అయోధ్య: భూమిపూజ ముహూర్తం పెట్టిన పండితుడికి బెదిరింపు కాల్స్

Update: 2020-08-05 06:15 GMT
అయోధ్యలో ఈరోజు రామాలయ నిర్మాణానికి భూమిపూజ జరగబోతోంది. ఈ సమయంలో ఈ భూమిపూజ కార్యక్రమానికి ముహూర్తం పెట్టిన పండితుడికి బెదిరింపు కాల్స్ రావడం కలకలం రేపుతోంది.

కర్ణాటకలోని బెళగావికి చెందిన పండితుడు ఎస్ఆర్ విజయేంద్ర శర్మ అయోధ్య రామాలయ నిర్మాణానికి భూమిపూజ ముహూర్తం పెట్టారు. ఏప్రిల్ లో అక్షయ తృతీయ నాడు ఈ ముహూర్తం ఖరారు చేశారు.. అయితే కరోనా లాక్ డౌన్ కారణంగా ఈ కార్యక్రమం వాయిదా పడింది.

దీంతో ఆగస్టు 5న అంటే ఈరోజున భూమిపూజకు ముహూర్తంగా ఖరారు చేశారు. ఈ ముహూర్తం ప్రకారం మధ్యాహ్నం 12 గంటలలోపు ఈ పూజ నిర్వహించాల్సి ఉంటుంది.

అయితే ఈ ముహూర్తం పెట్టిన విజయేంద్రకు బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి. రామాలయ భూమిపూజకు ముహూర్తం ఎందుకు పెట్టావని..  చంపేస్తామంటూ బెదిరించడంతో ఆయన పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పండితుడికి పోలీసులు భద్రత కల్పించారు.
Tags:    

Similar News