అంత పెద్ద వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు
ఆయన మాజీ డీజీపీ. అలాగే సీబీఐ మాజీ డైరెక్టర్ కూడా. అంతే కాదు.. మాజీ గవర్నర్ కూడా. ఇంతటి ఉన్నత పదవుల్లో పని చేసిన వ్యక్తి చివరికి ఆత్మహత్య చేసుకుని చనిపోవడం సంచలనం రేపుతోంది. ఆయన పేరు.. అశ్వనీ కుమార్. 69 ఏళ్ల ఆయన సిమ్లాలోని తన నివాసంలో బుధవారం రాత్రి బాగా పొద్దుపోయాక ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. అశ్వనీకుమార్ కొంత కాలంగా తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్నారని.. ఈ క్రమంలోనే ఆత్మహత్యకు పాల్పడ్డారని అంటున్నారు.
కానీ ఆయన అంత బాధలో ఉండటానికి కారణమేంటన్నది వెల్లడి కాలేదు. అశ్వనీకుమార్ ఆత్మహత్యకు పాల్పడిన విషయాన్ని సిమ్లా ఎస్పీ మోహిత్ చావ్లా ధ్రువీకరించారు. ఆయన మరణం తమను దిగ్భ్రాంతికి గురిచేసిందని ఆయన తెలిపారు. పోలీస్ అధికారులకు అశ్వనీకుమార్ ఆదర్శప్రాయులుగా ఉండేవారని గుర్తుచేసుకున్నారు.
అశ్వనీకుమార్ 2013-14 మధ్య నాగాలాండ్ రాష్ట్రానికి గవర్నర్‌గా పని చేశారు. మధ్యలో కొన్ని రోజుల పాటు మణిపూర్ రాష్ట్రానికి కూడా గవర్నర్‌గా ఉన్నారు. 1973 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి అయిన అశ్వనీకుమార్.. 37 ఏళ్ల పాటు సర్వీసులో ఉన్నారు. 2006-08 మధ్య హిమాచల్ ప్రదేశ్ డీజీపీగా కూడా పనిచేశారు. ఆ తర్వాత సీబీఐ డైరెక్టర్ కూడా అయ్యారు. 2008 ఆగస్టు నుంచి 2010 నవంబరు వరకు ఆయన ఆ పదవిలో ఉన్నారు.
హిమాచల్ ప్రదేశ్ నుంచి ఈ అత్యున్నత పదవిని చేపట్టిన తొలి వ్యక్తి అశ్వనీకుమారే. ఇంత పెద్ద స్థాయి వ్యక్తి, అత్యున్నత పదవులు చేపట్టిన అధికారి.. ఇలా బలవన్మరణంతో జీవితాన్ని చాలించడం అందరినీ షాక్‌కు గురి చేసింది. దీనిపై కుటుంబ సభ్యుల స్పందన కోసం అందరూ ఎదురు చూస్తున్నారు.