• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  అశోక్ హాట్ కామెంట్స్ :...

అశోక్ హాట్ కామెంట్స్ : రాజావారినే భయపెడుతున్నారా...?

By - Tupaki Desk
Update: 2022-06-23 02:30 GMT
ఆయన సాదా సీదా మనిషి కాదు, వందల ఏళ్ళకు పూర్వం ఆయన వంశీకులు ఏకంగా రాజులుగా సంస్థానాలను ఏలారు. వారి నియంత్రణలో నాడు ఎన్నో ఘనమైన  ప్రాంతాలు ఉండేవి. అలాంటి చరిత్ర  వహించిన పూసపాటి వంశానికి చెందిన ప్రస్తుత తరం వారసుడు అశోక్ గజపతిరాజు వైసీపీ సర్కార్ మీద తాజాగా హాట్ హాట్ కామెంట్స్ చేశారు.

తనను సింహాచలం చైర్మన్ పదవి నుంచి తప్పించేందుకు వైసీపీ నేతలు చూస్తున్నారు అని ఆయన ఆరోపించడం సంచలనం రేపుతోంది. అశోక్ ని 2020 మార్చిలో ఆల్ ఆఫ్ సడెన్ గా  తప్పించారు. ఆయన దాని మీద కోర్టుకు వెళ్ళి పోరాడి సాధించుకుని వచ్చారు. మరి ఆ తరువాత రెండేళ్ళూగా ఆయన ఒక విధంగా ప్రభుత్వంతో పోరాడుతూనే పదవిలో ఉన్నారు. ఇక లేటెస్ట్ గా చూస్తే ఆయన తన పదవికి ముప్పు తెచ్చేలా వైసీపీ వారి ఆలోచనలు ఉన్నాయని చెప్పుకొచ్చారు.

చట్టానికి వ్యతిరేకంగా తాను పనిచేస్తే కనుక తక్షణం తనను పదవి నుంచి తప్పించేందుకు చూస్తున్నారని ఆయన పేర్కొన్నారు. సింహాచలం పాలకవర్గం చేయకూడని పనుల విషయంలో తన మీద వత్తిడి తెస్తున్నారు అని ఆయన ఆరోపించారు. దేవస్థానానికి ప్రభుత్వానికి మధ్య అనేక భిన్నాభిప్రాయాలు ఉంటాయని ఆయన అన్నారు.

ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయాలను ధర్మకర్తల మండలి తీసుకోలేదని ఆయన అనడం విశేషం. తనను పంచగ్రామాలలో ఉన్న ఇళ్ళ మరమ్మతులకు సంబంధించి తీర్మానం చేయమని కోరుతున్నారని, అయితే తాను అలాంటి దుస్సాహసం చేయలేనని అశోక్ అంటున్నారు.  దీని మీద సభ్యులు ప్రతిపాదన పంపించినట్లైతే న్యాయపరమైన సలహాలు తీసుకుని చట్టబద్ధంగా అవి ఉంటేనే ఆమోదిస్తాను తప్ప లేకుంటే లేదని చెప్పేస్తాను అని ఆయన స్పష్టం చేస్తున్నారు.

ఒక వైపు పంచగ్రామాల మీద తీర్మానం చేయాలని తన మీద వత్తిడి తెస్తూనే మరో వైపు తనను తొలగించాలని సంబంధిత మంత్రి మీద ఎంపీ విజయసాయిరెడ్డి గట్టిగా ప్రయంత్నాలు చేస్తున్నారు అని అశోక్ ఆరోపించడం విశేషం. పంచగ్రామలకు సంబంధించి పాలకవర్గం చట్టాన్ని ఏ రూపేణా అధిగమించలేదని అశోక్ పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే గత దేవాదాయ శాఖ మంత్రి తనను తొలగిస్తాను అని పదే పదే బాహాటంగానే అంటూండేవారని, ఇపుడు కూడా అలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు అని వైసీపీ పెద్దల మీద చేస్తున్న ఆరోపణలు జనాలలో  చర్చనీయాంశం అవుతున్నాయి. మరి రాజు గారికే బెంగ పుట్టించేలా వైసీపీ పెద్దలు అనేక రకాలుగా  వత్తిళ్ళు తెస్తున్నారా. రాజావారితో రచ్చకు ఫుల్ స్టాప్ లేదా అసలు ఎందుకు ఇలా జరుగుతోంది. టార్గెట్ ఏంటి అన్నది మాత్రం ఇంకా సస్పెన్స్ గానే ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.
Tags:    
  • Ashokgajapatiraju 
  • YCP 
  • Government 
  • MP 
  • VijaySaiReddy 
  • Politics 
  • JaganMohanReddy 
  • PoliticalNews 

Similar News

ఇతరుల ఆనందమే కొలమానమా? జెన్ జెడ్ ను ఒత్తిడికి గురిచేస్తున్న సోషల్ మీడియా

2026-11-02 11:30 GMT

50 టీఎంసీల వరద..?! ‘మురసు’తో నిండనున్న పులిచింతల, నాగార్జునసాగర్

2026-11-02 11:04 GMT

దక్షిణాదికి బుల్లెట్ ట్రైన్.. బెంగళూరు నుంచి చెన్నైకి కేవలం 73 నిమిషాల్లోనే!

2026-11-02 10:24 GMT

తుఫాన్ల నెల నవంబర్.. అసలు కారణాలు ఏంటి?

2026-11-02 10:00 GMT

అమెరికా ఎన్నికలతో భారత్‌కు కొత్త పరీక్ష.. ట్రంప్ ఓడితే భారత్ కు లాభమా? నష్టమా?

2026-11-02 10:00 GMT

రాప్తాడు ఉన్మాదికి పోలీసు శిక్ష.. కుళ్లిపోయిన కుడికాలు, తొలగించే అవకాశం!

2026-11-02 09:58 GMT

తెలంగాణపై బీజేపీ ఫుల్ ఫోకస్.. అమిత్ షా ‘హైదరాబాద్ వ్యూహం’ గేమ్ ఛేంజర్ అవుతుందా?

2026-11-02 09:50 GMT

నెల్లూరుకు సమీపంలో ‘మురసు’.. ఐదు జిల్లాలలో భారీ వర్షాలు

2026-11-02 08:24 GMT

రాప్తాడు బాలిక హెల్త్ బులిటెన్.. కీలక సమాచారం వెల్లడించిన మంత్రి లోకేశ్

2026-11-02 07:56 GMT

ఓడిపోతానని ట్రంప్ కు జ్ఞానోదయం.. ఇన్నాళ్లకు తెలిసి (తెలివి) వచ్చింది..

2026-11-02 07:05 GMT

మారథాన్‌లో విజయం.. జీవితంలో విషాదం.. పరుగుపందెం పూర్తి చేసి ప్రాణాలు విడిచిన టెక్కీ

2026-11-02 06:43 GMT

తొలిరోజే రూ.68 లక్షల జరిమానాలు.. ఢిల్లీలో కాలుష్యంపై యుద్ధం..

2026-11-02 05:28 GMT

Copyright @2026

Powered by Blink CMS