బ్రేకింగ్: కిడ్నాప్ కేసులో ఏవీ సుబ్బారెడ్డి అరెస్ట్
తెలంగాణ సీఎం కేసీఆర్ బంధువుల కిడ్నాప్ కేసు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనమైంది. ఈ కిడ్నాప్ నకు పాల్పడింది ఏపీకి చెందిన మాజీ మంత్రి, టీడీపీ నాయకురాలు కావడం.. ఈమెతోపాటు ప్రముఖ ఏపీ నేత కూడా ప్రమేయం ఉందని తెలియడంతో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. వరుస అరెస్టులతో ఇప్పుడు ఈ కేసు తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తున్నది..
కిడ్నాప్ కేసులో ఈ ఉదయం ఇప్పటికే మాజీ మంత్రి భూమా అఖిలప్రియను పోలీసులు అరెస్ట్ చేశారు. కూకట్ పల్లిలోని అఖిలప్రియనివాసంలో ఈ ఉదయం 11.30 గంటలకు ఆమెను అరెస్ట్ చేశారు.
ఇక పోలీసుల విచారణలో అనూహ్యమైన ట్విస్ట్ నెలకొంది. ఈ కేసులో పోలీసులు ఏ1గా ఏవీ సుబ్బారెడ్డిని పేర్కొన్నారు. ఏ2గా భూమా అఖిలప్రియను, ఏ3గా భార్గవ్ రామ్ ను పేర్కొంటూ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
ఈ క్రమంలోనే కొద్దిసేపటి క్రితమే ఏవీ సుబ్బారెడ్డిని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు పలు మీడియా చానెల్స్ లో వెలువడ్డాయి. ఇక మిగిలిన నిందితులను కూడా త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
ఇక అరెస్ట్ చేసే సమయంలో ఏవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ కేసుకు సంబంధించి ఎలాంటి వివరాలు అడిగినా తాను చెప్పేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన తెలిపారు.