• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  పార్లమెంట్​ లోనే దుకాణం...

పార్లమెంట్​ లోనే దుకాణం పెట్టాడుగా.. రొమాన్స్​ చేస్తూ రెడ్​ హ్యాండెడ్​ గా పట్టుబడ్డ ఎంపీ

By - Tupaki Desk
Update: 2020-09-26 23:30 GMT
ఆయనో ప్రజాప్రతినిధి.. తమ సమస్యలు పరిష్కరిస్తాడని .. తమ ప్రాంతాన్ని అభివృద్ది చేస్తాడని ప్రజలు ఎన్నుకున్నారు. కానీ సదరు నేత సభ్యసమాజం తలదించుకొనే పనిచేశాడు. ఏకంగా పార్లమెంట్​లో అందరూ చూస్తుండగానే తన సెక్రటరీని ముద్దుపెట్టుకుంటూ రొమాన్స్​ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్​మీడియాలో వైరల్​గా మారింది. ప్రస్తుతం సదరు ఎంపీపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి. యువతి టీ షర్టును కిందికి లాగి మరీ ముద్దాడాడు. ఇదంతా లైవ్​ టెలీకాస్ట్​ కావడంతో చివరకు తన ఎంపీ పదవి ఊడింది. ఈ ఘటన ఇటీవల అర్జెంటీనా దేశంలో జరగగా .. ప్రపంచవ్యాప్తంగా వైరల్​గా మారింది.

కరోనా మహమ్మారిని ఎలా అరికట్టాలనే విషయం చర్చించేందుకు అర్జెంటీనాలో పార్లమెంట్​ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం సభలో చర్చ జరుగుతోంది. ఎంపీలంతా ఎంతో ఆసక్తిగా చర్చను వింటున్నారు. ఈక్రమంలో అధికార పార్టీ పెరోనిస్ట్​కు చెందిన ఎంపీ ఎమిలియో అమేరి ఓ యువతితో సరసాలు ఆడాడు. ఆన్​లైన్​లో ఈ చర్చను అందరూ వింటున్నారన్న సోయి లేకుండా ఆయన రెచ్చిపోయాడు.
మహిళ ఎదను ముద్దుపెట్టుకుంటూ విచక్షణ కోల్పోయాడు. ఈ విషయాన్ని గమనించిన హౌస్​ అధ్యక్షుడు సెర్జీయో మస్సా షాక్​ అయ్యాడు. వెంటనే అమెరీని హౌస్​ నుంచి సస్పెండ్​ చేశాడు.

దీనిపై సెర్జీయో స్పందిస్తూ ‘ఇది నిజంగా సిగ్గుమాలిన చర్య. ప్రజలకు సంబంధించిన ప్రతినిధులుగా హుందాగా వ్యవహరించవలసిన మనం ఇంతకు దిగజారితే ఇక ప్రజలు మనల్ని చూసి ఏం నేర్చుకుంటారు. నేను అమేరిని వెంటనే హౌస్​ నుంచి సస్పెండ్​ చేస్తున్నాను. ఈ విషయంపై విచారించేందుకు ప్రత్యేకంగా ఓ కమిటీని నియమిస్తున్నాను’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సెర్జియో నిర్ణయంతో హౌస్​సభ్యులంతా ఏకీభవించారు. అతడని సస్పెండ్ చేసేందుకు పూర్తిమద్దతు తెలిపారు. అయితే సదరు ఎంపీ రొమాన్స్​ చేసింది తన దగ్గర పనిచేసే రాజకీయ సలహాదారుతోనే అని సమాచారం. ఎంపీ అమేరి కొంత కాలం క్రితం తన భార్యతో విడిపోయాడు. అనంతరం ఈమెను రాజకీయసలహాదారుడిగా నియమించుకున్నారు. అయితే ఈ విషయంపై అమేరి మీడియాతో మాట్లాడాడు. ‘ నేను చేసిన పనికి సిగ్గుపడుతున్నాను. ఆ సమయంలో ఇంటర్నెట్​ పోయిందని భావించి నేను ఆ పనికి పూనుకున్నాను. కానీ దురదృష్టవశాతు కరెంట్​ రావడంతో నేను దొరికిపోయాను. ఏ శిక్ష విధించినా అనుభవించేందుకు సిద్ధంగా ఉన్నాను’ అంటూ స్పందించాడు. ఏది ఏమైనా అమేరి చేసిన పనికి నెటిజన్లు తీవ్రంగా మండిపడతున్నారు.
Tags:    
  • Argentina 
  • MP 

Similar News

మూడు ముళ్ల బంధం.. రూ. 7.50 లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యం!

2026-11-19 19:30 GMT

వీఐపీలు వస్తేనే ముంబైకి అందం.. సామాన్యులు ఉంటే ఎందుకీ దుర్గంధం?

2026-11-19 18:30 GMT

సహచరుల వద్ద తలెత్తుకోలేకపోతున్నా.. ఇప్పుడే వైసీపీలోకి వెళ్లిపోండి! – టీడీపీ ఎమ్మెల్యే థామస్ సంచలన వ్యాఖ్యలు

2026-11-19 17:30 GMT

AI హడావుడి.. సినిమాకు ఒరిగిందేంటి!

2026-11-19 17:30 GMT

పార్టీలు, ఫంక్షన్లు జరగాలంటే ఆ రూల్స్ పాటించాలా?

2026-11-19 16:30 GMT

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

Copyright @2026

Powered by Blink CMS