ఇద్దరు వరంగల్ ఎమ్మెల్యేలకు పరువు పోయిందా?

Update: 2020-08-08 06:50 GMT
కరోనాకు మందు లేదు.. ఇంకా కనిపెట్టలేదు. వ్యాక్సిన్ వస్తేనే బతికిపోతాం. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కొందరి భయాల్ని డాక్టర్లు క్యాష్ చేసుకుంటున్నారు. ఈ కషాయాలు తాగితే కరోనా ఖతం అంటూ ఊదరగొడుతున్నారు. ఈ గోలీలు వాడితే కరోనా రాదంటూ రొజుకొక మందు మార్కెట్లోకి వస్తోంది. హోమియోపతి, అల్లోపతి ఇలా లెక్కలేనన్న ఆయుర్వేద కషాయాలు, మందులు మార్కెట్ ను ముంచెత్తుతున్నాయి. మందే లేకపోవడంతో జనాలు వీటిని కొంటూ జేబులు ఖాళీ చేసుకుంటున్నారు.

ఇప్పుడు కరోనా భయం ఎమ్మెల్యేలను కూడా మోసపోయేలా చేస్తోంది.  వరంగల్ లో కషాయం పేరిట ఏకంగా  ఎమ్మెల్యేలను బురిడీ కొట్టించాడో డాక్టర్. ఇప్పుడు ఆ డాక్టర్ చేసిన పనికి కరోనా బాగా ప్రబలి ఇప్పుడు ఎమ్మెల్యేల పరువు పోయిందట..

కరోనా వల్ల ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారో వాళ్లకే అర్థం కావడం లేదట.. ఒక డాక్టర్ కాషాయం తాగితే కరోనా రాదు అని మాస్క్ కూడా పెట్టుకోవాల్సిన పనిలేదు అని పెద్ద ఎత్తున ప్రచారం చేసి ఆ ఎమ్మెల్యేలను బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టుకున్నారు. ఆ కాషాయంను ఉపయోగించుకొని ఎమ్మెల్యేలకు తాగించి వారితో పక్కన కూర్చో పెట్టుకొని పెద్ద ఎత్తున  ఫొటోలు తీసుకొని  ఆ డాక్టర్ క్యాష్ చేసుకున్నాడట.. సదురు డాక్టర్ ఆ ఎమ్మెల్యేలు తన కాషాయం తాగారని పేర్కొంటూ పెద్ద ఎత్తున యాడ్స్  ఇచ్చి ప్రచారం చేసుకున్నాడట..

ఆ కాషాయం ఇచ్చిన డాక్టర్ దగ్గర పెద్ద ఎత్తున ఈ మధ్య కరోనా ప్రబలింది అని టాక్. ఆయన వల్ల చాలా మంది కరోనా సోకిందని తేలిందట.. ఈ ఎమ్మెల్యేలు సదురు డాక్టర్ కు డబ్బా కొట్టడంతో ఇప్పుడు వారికి తలదించుకునే పరిస్థితి ఏర్పడిందట..  ఆ డాక్టర్ వల్ల ఎమ్మెల్యేల పరువు పోయిందని వరంగల్ పొలిటికల్ సర్కిల్స్ లో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. 
Tags:    

Similar News